
హైదరాబాద్: అతి పెద్ద నెట్‌వర్క్ కలిగిన ఫేస్‌బుక్, గూగుల్‌లకు కాంపిటేషన్‌గా కొత్తగా వచ్చి అంతా తానై విస్తరిస్తోన్న జియో నెట్‌వర్క్ పెద్ద ఎదురుదెబ్బ కానుంది. వచ్చే వారం నిర్వహించనున్న బీసీసీఐ డిజిటల్ మీడియా హక్కుల వేలంలో ఫేస్‌బుక్, గూగుల్‌లతో పాటుగా జియో సైతం పాల్గొననుంది. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు ఆడే మ్యాచ్‌ల డిజిటల్ హక్కులకు భారీ పోటీ నెలకొంది.
ఈమేరకు వచ్చే ఐదేళ్లపాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రఖ్యాత సోషల్ నెట్‌వర్క్ సైట్ ఫేస్‌బుక్‌తో పాటు సెర్చింజన్ గూగుల్ కూడా పోటీలో ఉన్నాయి. వీటితోపాటు జియో ఇన్‌ఫోకామ్ లిమిటెడ్, హాట్‌స్టార్, యప్ టీవీ, సోనీ టీవీ కూడా బరిలో ఉన్నాయి. ఈనెల 27న జరగాల్సిన ఈ-వేలాన్ని ఇటీవలే బీసీసీఐ వచ్చేనెల 3కు వాయిదా వేసింది. ఏప్రిల్ 2018 నుంచి మార్చి 2023 వరకు బిడ్డింగ్ గెలిచిన కంపెనీ మూడు రకాల హక్కులు కలిగి ఉంటుంది.
గ్లోబల్ టీవీ రైట్స్‌తో పాటు భారత ఉపఖండ డిజిటల్ హక్కుల ప్యాకేజి, గ్లోబల్ కన్సాలిడేటెడ్ హక్కుల ప్యాకేజి ఇందులో ఉంటాయి. డిజిటల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ఐదు సంవత్సరాలు కలిపి వేలం ప్రారంభ ధర రూ. 7 నుంచి 8 కోట్లు మధ్య ఉంటుంది. ఇదే వేలంలో మ్యాచ్‌కు మొదటి సంవత్సరానికి రూ.35కోట్లు తర్వాతి నాలుగేళ్లకు రూ.33కోట్లు ఉండాలని నిర్ణయించింది.
కేవలం ఐపీఎల్ ప్రసార హక్కులను అమ్మకాన్ని జరిపిన బీసీసీఐ రూ.16347.5కోట్లు ధరకు అమ్మేసింది. వేలంలో పాల్గొననున్న ఫేస్‌బుక్ ఖాతాల నుంచి వారం క్రితం డేటా చోరికీ గురవడంపై దాదాపు ఇప్పటికే రూ.3900కోట్ల మేర నష్టం వాటిల్లింది.