
హైదరాబాద్: 'ఫేస్ యాప్' ఛాలెంజ్... ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సరికొత్త ఛాలెంజ్. ఈ 'ఫేస్ యాప్' ఛాలెంజ్ ద్వారా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ టీమిండియా క్రికెటర్లు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో ఈ యాప్ ద్వారా రూపొందించి ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ధోని, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తదితరులు వృద్ధాప్యంలోనూ భిన్నంగా ఉన్నారు. ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలో అద్భుతంగా ఆడిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడి నిష్క్రమించింది.