Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గన్‌తో బెదిరించి దారుణంగా.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌కు షాక్!

సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు అతడిని గన్‌తో బెదిరించి విలువైన వస్తువులను దోచుకుని వెళ్లారు. దక్షిణాఫ్రికాలోని ఫేమస్ శాండ్టన్‌ సన్ హోటల్ సమీపంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఫోన్, బ్యాగ్‌తో పాటు మరికొన్ని వ్యక్తిగత వస్తువులను దోచుకున్నారు. ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. సౌతాఫ్రికాలో ఆటగాళ్ల భద్రతపై ఆందోళలనలు మొదలయ్యాయి. అయితే ఫాబియన్ అలెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Fabian Allen mugged at gunpoint-shocking incident in SA20

''ఫాబియన్‌తో వెస్టిండీస్ ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ మాట్లాడారు. అంతేగాక మరో అధికారి ఒబెడ్ మెక్‌కాయ్ కూడా ఫాబియన్ గురించి విషయాలు ఆరా తీశారు. అతడు క్షేమంగానే ఉన్నాడు. ఈ విషయంలో మరిన్ని వివరాలు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఏ), పార్ల్ రాయల్స్ జట్టు యాజమాన్యం తెలియజేస్తుంది'' అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

అయితే ఈ సంఘటన గురిచి పార్ల్ రాయల్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) నిర్వహకులు పోలీసుల నుంచి జరిగిన విషయాలు తెలుసుకుంటున్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సౌతాప్రికా క్రికెట్ బోర్డుకు SA20 ఊరట ఇచ్చింది. గతేడాది ప్రారంభమైన ఈ లీగ్ రెండో సీజన్ జరుగుతోంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్‌ దశకు చేరుకుంది. ఆటగాళ్ల భద్రత విషయంలో సౌతాఫ్రికా వైఫల్యం చెందితే ఆ బోర్డుకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.

కాగా, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన పార్ల్ రాయల్స్ బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇవాళ క్వాలిఫయిర్-1లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ - డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో రాయల్స్ తరఫున ఆడుతున్న అలెన్ ప్రదర్శన పేలవంగా ఉంది. 38 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Tuesday, February 6, 2024, 9:13 [IST]
Other articles published on Feb 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+