బట్లర్ బ్యాట్‌పై అసభ్య పదజాలం, ఐసీసీ ఆగ్రహం

హైదరాబాద్: ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మందలించింది. మరొకవైపు అభిమానులు సైతం బట్లర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన బ్యాట్‌పై ఉన్న అసభ్యకరమైన పదాలే ఇందుకు ప్రధాన కారణం. తొలి టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లాండ్ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విజయంలో బట్లర్ కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, బట్లర్ బ్యాట్‌పై ఉన్న అసభ్య పదజాలం అతన్ని ఇరకాటంలో పడేసింది.

హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు
వివరాల్లోకి వెళితే.. రెండో టెస్టు మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామ సమయంలో బట్లర్ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామ సమయంలో బట్లర్ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. హెల్మెట్‌పై ఉంచిన బ్యాట్‌పై ఏదో రాసి ఉందని గమనించిన కెమెరామెన్ అదేంటో చూద్దామని కాస్త జూమ్ చేశారు.

ఎందుకు జూమ్ చేశానా .. కెమెరామెన్
ఆ బ్యాట్‌పై ఉన్న పదజాలం చూసి కంగుతిన్న కెమెరామెన్ ఆ తర్వాత ఎందుకు జూమ్ చేశానా అని అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి కెమెరా దృష్టిని మళ్లించాడు. ఇంతలోనే ఆ బ్యాట్‌పై ఏమి రాసి ఉందో గమనించిన అభిమానులు ఫొటోలు తీసేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.

బ్యాట్‌పై ఏమి రాసుకున్నాడో చూశారా
దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘బట్లర్ తన బ్యాట్‌పై ఏమి రాసుకున్నాడో చూశారా' అంటూ నెటిజన్లు ఈ ఫొటోను తెగ షేర్ చేసేస్తున్నారు. అది వాడకూడని పదజాలం కావడంతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొకసారి ఇలా వ్యవహరించకూడదంటూ బట్లర్‌కు మందలింపుతో సరిపెట్టింది.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను
పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ డ్రా చేసుకుంది. తొలి టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లాండ్ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆటగాడు బట్లర్ ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన బట్లర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications