
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌ను హెచ్‌సీఏ గౌరవించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ పెవిలియన్ స్టాండుకు అజహరుద్దీన్ పేరు పెట్టింది.
ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాండ్‌ను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ శుక్రవారం ప్రారంభించాడు. నార్త్ పెవిలియన్‌లోని స్టాండ్‌ను ఇటీవలే పునరుద్ధరించారు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20కి ముందు ఈ స్టాండ్‌ను ఆవిష్కరించారు.
మరోవైపు హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి దయానంద్ పేరిట సౌత్ పెవిలియన్‌లో లాంజ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ నోయల్ డేవిడ్, వెంకటపతిరాజు, పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్ సన్మానించాడు. స్టాండ్ ప్రారంభించిన అనంతరం అజహర్ మాట్లాడుతూ ఈ గౌరవం తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.
ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరయ్యాడు. గంగూలీతో పాటు బీసీసీఐ బోర్డు ఇతర పెద్దలు, మాజీ క్రికెటర్లు కూడా హాజరయ్యారు. అజహరుద్దీన్ భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. అజహర్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.