
పాకిస్థాన్‌పై భారత్ 5వికెట్ల తేడాతో గెలిచి ఆసియా కప్ టోర్నీలో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కీలకమైన 35పరుగులు చేశాడు. అయితే కోహ్లీ ఔటయిన తీరు మాత్రం విస్మయకరంగా అనిపించింది. కోహ్లీ ఔట్ పట్ల చాలా నిరాశ చెందాను అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. తొలి ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ను కోల్పోయిన భారత్.. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ 49పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్పిన్నర్ల బౌలింగ్లో ఎటాకింగ్ గేమ్ ఆడాలని చూసి వీరిద్దరు ఒకే తరహాలో ఔటయిపోయారు.
8వ ఓవర్లో మహ్మద్ నవాజ్ బౌలింగ్లో రోహిత్ సిక్స్ కొట్టి లాంగాఫ్లో క్యాచ్ ఔట్ కాగా..పదో ఓవర్ తొలి బంతికి నవాజ్ బౌలింగ్లోనే కోహ్లీ సైతం లాంగాఫ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు.దీంతో భారత్ 3 వికెట్ల నష్టానికి 53పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా (35), హార్దిక్ పాండ్యా (33 నాటౌట్) బ్యాటింగ్‌తో భారత్ విజయాన్ని ముద్దాడింది. అయితే విరాట్ కోహ్లీ ఔటయిన తీరు పట్ల ఆశ్చర్యపడ్డ గౌతం గంభీర్ మాట్లాడుతూ.. 'అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఎన్ని పరుగులు చేశాడో మనకు తెలుసు.
కోహ్లీ ఆడిన ఈ షాట్ చూసినప్పుడు అతను ఆ షాట్ అనవసరంగా ఆడానని తనంతట తానుగా ఒప్పుకుంటాడు. రోహిత్ అవుట్ అయిన వెంటనే హిట్టింగ్ చేయాలనే థాట్ ఏం అవసరం.. మీ ఇన్నింగ్స్‌ను కొంత నిర్మించగా.. ఆటోమేటిక్‌గా పరిస్థితి కాస్త ఈజీ అవుతుంది' అని గంభీర్ పేర్కొన్నాడు.
లాంగ్ ఆఫ్ బౌండరీని క్లియర్ చేయడానికి షాట్ కొట్టాలా వద్దా అనేలా ఆడి ఔట్ అయినందున కోహ్లీ తన అనుభవాన్ని ఉపయోగించుకోలేదని గంభీర్ చెప్పాడు.
' ఇది నిరాశపరిచే షాట్. ఎందుకంటే అది అసలు షాటే కాదు. సిక్సర్ కొట్టాలని చూస్తూ ఔట్ అయితే అందులో తప్పు లేదు. ఎందుకంటే మీరు పెద్ద షాట్ ఆడే క్రమంలో ఔటయ్యారని ఒప్పుకోవచ్చు. కానీ కోహ్లీ సిక్సర్ కొట్టడానికి ప్రయత్నించలేదు. అలాగే గ్యాప్‌లో బాదాలని కూడా చూడలేదు. అసలు ఆ షాటేంటో కూడా అతనికి తెలుసో తెలీదో. ఏదో ముందుకు వచ్చి కొట్టాలా వద్దా అనే డైలామాలో బాది ఔటయిపోయాడు. ఇక ముందు కోహ్లీ చూసుకోవాలి. ఇలాంటి షాట్ కోహ్లీ లాంటి స్టార్ల నుంచి చూడకూడదు' అని గంభీర్ తెలిపాడు.