Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ముగ్గురూ ఆడ‌క‌పోతే కివీస్ క‌థ క్లోజ్‌..!

 Experience of Kane Williamson, Ross Taylor, Martin Guptill key for New Zealand in final: Daniel Vettori

లండ‌న్: ప‌్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆ ముగ్గురూ త‌మ స్థాయికి మించి రాణిస్తేనే న్యూజిలాండ్ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆ జ‌ట్టు మాజీ కేప్టెన్, లెజెండ‌రీ స్పిన్న‌ర్ డేనియ‌ర్ వెటోరీ అన్నారు. జ‌ట్టు భారం మొత్తం ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్‌, కేప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌, సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేల‌ర్ మీదే ఆధార‌ప‌డి ఉంద‌ని అన్నారు. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఈ ముగ్గురూ ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోతే.. జ‌ట్టు గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌ప్టిల్‌, విలియ‌మ్స‌న్‌, రాస్ టేల‌ర్‌, టామ్ లాథ‌మ్‌, ట్రెంట్ బౌల్ట్ 2015 ప్ర‌పంచ‌క‌ప్ ఆడార‌ని, ఆ అనుభ‌వం జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపిస్తుంద‌ని తాను విశ్వ‌సిస్తున్నట్లు చెప్పారు వెటోరీ.

వారి నాయ‌క‌త్వం గొప్ప‌ది..

న్యూజిలాండ్, ఇంగ్లండ్ జ‌ట్ల కేప్టెన్లు కేన్ విలియ‌మ్స‌న్‌, ఇవాన్ మోర్గాన్‌ల‌ను వెటోరీ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. వారి నాయ‌క‌త్వం వ‌ల్లే ఈ రెండు జ‌ట్లు ఫైన‌ల్‌కు చేరుకోగ‌లిగాయ‌ని అన్నారు. ఒత్తిడిలో ప‌డిన ప్ర‌తీసారీ ఇద్ద‌రు కేప్టెన్లు తెలివిగా వ్య‌వ‌హ‌రించార‌ని, జ‌ట్టుకు విజ‌యాలు అందించ‌గ‌లిగార‌ని చెప్పారు. ఇద్ద‌రు గొప్ప కేప్టెన్ల పోరాటాన్ని తిల‌కించాల్సి రావ‌డం అదృష్ట‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఆడిన అన్ని జ‌ట్ల కేప్టెన్ల కంటే కేన్ విలియ‌మ్స‌న్, ఇవాన్ మోర్గాన్ అత్యుత్త‌మ నాయ‌కుల‌ని కితాబిచ్చారు. బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ నుంచి నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అందుకున్న కేన్ విలియ‌మ్స‌న్ అతి త‌క్కువ కాలంలోనే జ‌ట్టుపై త‌న‌దైన ముద్ర వేశాడ‌ని అన్నారు.

Story first published: Sunday, July 14, 2019, 13:45 [IST]
Other articles published on Jul 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+