'అనుభవాన్ని మార్కెట్‌లో అమ్మలేం లేదా కొనలేం'

హైదరాబాద్: ఆటగాడిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా తాను ఎంతో అనుభవాన్ని సంపాదించినట్లు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. నాలుగు దశాబ్దాలుగా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని.. ఇప్పుడు తాను ఈ స్థాయికి చేరుకోవడానికి అనుభవమే ఉపయోగపడిందని రవిశాస్త్రి అన్నాడు.
కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ సలహా కమిటీ ఇటీవలే రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా తిరిగి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండేళ్ల పాటు రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవిలో కొనసాగనున్నాడు. అదే విధంగా సహాయక సిబ్బందిలో భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్‌ను తిరిగి కొనసాగించడంపై శాస్త్రి గల్ఫ్ న్యూస్‌కి ఇంటర్యూ ఇచ్చాడు.

శాస్త్రి మాట్లాడుతూ
ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ "నన్ను నేను జడ్జ్ చేసుకోవడానికి ఇష్టపడను. గత నలభై ఏళ్లుగా ఆటలో భాగస్వామిగా ఉన్నాను. 17 ఏళ్ల వయసులో ముంబై తరఫున ఆడాను. 18 ఏళ్లకు ఇండియాకు ఆడాను. అప్పటి నుంచి ఒక్క సీజన్ కూడా క్రికెట్‌కు దూరం కాలేదు. బ్రాడ్‌కాస్టర్‌గా, డైరెక్టర్‌గా, కోచ్‌గా టీమిండియాతో పాటు నా ప్రయాణం కొనసాగుతోంది" అని అన్నాడు.

దగ్గరగా చూసే అవకాశం నాకు దక్కింది
"అందుకే ఆటను దగ్గరగా చూసే అవకాశం నాకు దక్కింది. అలాంటి అనుభవం ఉన్నందువల్లే మ్యాన్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు కలిగాయి. ఆ అనుభవం కచ్చితంగా పనికివస్తుంది. అనుభమనేది మార్కెట్‌లో దొరికే వస్తువు కాదు. దానిని ఎవరూ అమ్మడం గానీ కొనడం గానీ చేయలేరు" అని రవిశాస్త్రి తెలిపాడు.

ఐదేళ్లుగా జట్టు ఓ విధమైన ఫ్యాషన్‌తో
"గత ఐదేళ్లుగా జట్టు ఓ విధమైన ఫ్యాషన్‌తో ఆడుతోంది. అలాంటి జట్టు వెనుక నిలబడం ముఖ్యం. నాతో పాటు భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్‌కు కూడా జట్టుతో మంచి అనుబంధం ఉంది. జట్టును మేటిగా నిలిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా జట్టు విజయ పరంపర కొనసాగేందుకు దోహదపడుతుంది" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications