Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎక్స్‌క్లూజివ్: ఐపీఎల్‌లో యువరాజ్ ఒక్కో పరుగు ఖరీదు అక్షరాలా రూ. 6.45 లక్షలు

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢీల్లీ డేర్ డెవిల్స్ తరుపున ఆడుతున్న యువరాజ్ సింగ్ వరుసగా విఫలమవుతున్న తరుణంలో యవీ పరుగులు చాలా ఖర్చుతో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటంలో యువరాజ్ సింగ్‌ను ఢిల్లీ ప్రాంచైజీ రూ 16 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో యువరాజ్ ఆటతీరుతో అభిమానుల అంచనాలను అందుకోవడంలో వరసుగా విఫలమవుతున్నాడు. అటి ఢిల్లీ ప్రాంఛైజీ అతడిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్ ఆడిన యవీ కేవలం 124 పరుగులు (ఒక అర్ధ సెంచరీ) మాత్రమే చేశాడు.

ఐపీఎల్ టోర్నమెంట్లో అప్పుడే ఢిల్లీ జట్టు సగం టోర్నమెంట్‌ను ఆడేసింది. అంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు(7 మ్యాచ్‌లు సొంత మైదానంలో, మిగతా 7 మ్యాచ్‌లు బయట) ఆడనుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో టాప్ ఫోర్ బ్యాట్స్ మెన్లలో నాల్గవ స్ధానంలో యువీ ఉన్నాడు.

Expensive: Yuvraj Singh's each run in IPL 2015 costs Rs 6.45 lakh!

ఢిల్లీ జట్టులో శ్రేష్ట అయ్యర్ 227 పరుగులతో మొదటి స్ధానంలో ఉండగా, కెప్టెన్ జేపీ డుమిని 220 పరుగులతో రెండో స్ధానంలో నిలిచాడు. 150 పరుగులతో మూడో స్ధానంలో మయాంక అగర్వాల్, 124 పరుగులతో యువీ నాల్గవ స్ధానంలో ఉన్నాడు. ఢిల్లీ ప్రాంఛైజీవి ఏడు మ్యాచ్‌ల్లో ముగియడంతో ప్లేఆఫ్స్‌లో ఢిల్లీ చోటు కష్టంగా మారింది.

ఏప్రిల్ 26 నాటికి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్దానంలో ఉంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో యువీ 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటివరకు జరిగిన 7 మ్యాచ్‌ల్లో యువరాజ్ సింగ్ కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు. దీనిని బట్టి చూస్తే ఒక్కో పరుగుకి ఢిల్లీ ప్రాంఛైజీ యువీకి రూ. 6.5 లక్షలు చెల్లించినట్లవుతుంది.

ఈ డబ్బు చెల్లించింది కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే కాదు. యువరాజ్ సింగ్ ఆల్ రౌండర్ (ఫీల్డింగ్, బౌలింగ్) ప్రదర్శనకు. ఐపీఎల్ 2015లో యువరాజ్ సింగ్ 14 మ్యాచ్‌లు ఆడుతుంటే, ఒక్కో గేమ్‌కు రూ. కోటి రూపాయలు ప్రాంఛైజీ చెల్లిస్తుంటే, ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లకు యువీ రూ. 8 కోట్లు తీసుకున్నాడని అనుకుందాం. దీంతో యువీ చేసిన ఒక్కో పరుగు ఖరీదు రూ. 6,45,161.

గత ఏడాది జరిగిన ఐపీఎల్‌ 7వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ యువరాజ్‌ని రూ. 14 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసింది. 14 మ్యాచ్‌ల్లో ఆడిన యువరాజ్ సింగ్ 376 పరుగులుతో పాటు 5 వికెట్లను తీసుకున్నాడు.

ఐపీఎల్ 8వ ఎడిషన్‌లో యువీ పరుగుల జాబితా:

* 9 Vs చెన్నై సూపర్ కింగ్స్
* 27 Vs రాజస్ధాన్ రాయల్స్
* 54 Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్
* 9 Vs సన్ రైజర్స్ హైదరాబాద్
* 21 Vs కోల్ కత్తా నైట్ రైడర్స్
* 2 Vs ముంబై ఇండియన్స్
* 2 Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

మొత్తం - 124 runs in 7 innings

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+