ఆతృతగా ఎదురు చూశా.. నిరాశ చెందా: జట్టు ఎంపికపై తొలిసారి శుభమాన్ గిల్

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనకు ఎంపిక చేసిన ఏదో ఒక జట్టులో తప్పక చోటు దక్కుతుందని తాను ఆశించానని టీమిండియా యువ క్రికెటర్ శుభమాన్ గిల్ అన్నాడు. ఆదివారం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండిస్ పర్యటనకు భారత జట్టుని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
ఆ జట్టులో ఇప్పటికే వెస్టిండిస్ పర్యటనలో ఉన్న టీమిండియా-ఏ ఆటగాళ్లు పలువురు చోటు దక్కించుకున్నారు. మొత్తం ఏడుగురు ఆటగాళ్లు విండిస్ పర్యటనకు ఎంపికయ్యారు. మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ షైనీ, దీపక్ చాహర్, రాహుల్ చాహర్ తదితరులు ఉన్నారు.

వెస్టిండిస్ పర్యటనలో
వీరంతా కూడా వెస్టిండిస్ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ తరుపున ఆడనున్నారు. అయితే, ఇదే జట్టులో తప్పక చోటు దక్కుతుందని భావించిన యువ ఆటగాడు శుభమాన్ గిల్‌ను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీనిపై సెలక్టర్ల తీరుని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశ్నించారు.

టాప్ స్కోరర్‌గా గిల్
వెస్టిండిస్-ఏ జట్టుతో జరిగిన అనధికార ఐదు వన్డేల సిరిస్‌లో శుభమాన్ గిల్ అత్యధిక పరుగులు చేసినప్పటికీ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐదు వన్డేల్లో 54.50 యావరేజితో శుభమాన్ గిల్ మొత్తం 218 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

బ్యాట్‌తో రాణించినప్పటికీ
బ్యాట్‌తో రాణించినప్పటికీ సెలక్టర్లు అతడి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు. మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్‌ల మాదిరే శుభమాన్ గిల్ కూడా బ్యాట్‌తో రాణించినప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోకపోవడం అభిమానులను సైతం నిరాశపరిచింది. ఈ విషయమై శుభమాన్ గిల్ స్పందించాడు.

ఎంతో ఆతృతగా ఎదురు చూశా
"గత ఆదివారం వెస్టిండిస్ పర్యటనకు జట్టుని ఎంపిక చేసిన సమయంలో ఎంతో ఆతృతగా ఎదురు చూశా. ఏదో ఒక జట్టులో తప్పక చోటు దక్కుతుందని నేను ఆశించా. అయితే, నన్ను ఎంపిక చేయకపోవడం ఎంతో నిరాశకు గురి చేసింది. దీనిపై ఎక్కువ సమయం ఆలోచించదలచుకోలేదు" అని గిల్ అన్నాడు.

పరుగులు చేయడం మాత్రం ఆపను
"అయినా సరే నేను పరుగులు చేయడం ఆపను. మంచి ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిలో పడతా" అని క్రిక్‌నెక్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో శుభమాన్ గిల్ వెల్లడించాడు. వెస్టిండీస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో భారత్ -ఏ అదరగొట్టింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications