'ద్రవిడ్ ఇచ్చిన సలహాతోనే భారత టెస్టు జట్టులో చోటు'


హైదరాబాద్: భారత టెస్టు జట్టులో ఒక్కడినైనందుకు చాలా సంతోషంగా ఉందని యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ తెలిపాడు. వెస్టిండిస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం 15 మంది జట్టు సభ్యులను బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌పై వేటు వేసిన సెలక్టర్లు కర్ణాటకకు చెందిన యువ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించారు. భారత్-ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన సలహాతోనే తను దేశవాళీ క్రికెట్‌లో రాణించానని, దీంతోనే విండిస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైనట్లు మయాంక్ అగర్వాల్ తెలిపాడు.

భారత జట్టులో ఒక్కడినైనందుకు చాలా ఆనందంగా ఉంది
ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ "భారత జట్టులో ఒక్కడినైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్యలో మేం చాలా క్రికెట్ ఆడాం. ఇదే మా ఆటమీద ఫోకస్ పెరిగేలా చేసింది. ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా బాధ్యత" అని చెప్పుకొచ్చాడు.

నా ప్రదర్శను ఇలానే కొనసాగిస్తా
"అంతే తప్ప ఇతర వ్యవహారాల గురించి నేను ఆలోచించను. నా ప్రదర్శను ఇలానే కొనసాగించడం.. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తూ మెరుగుపరుచుకోవడమే నాకు కావాలి. మాకు ఎప్పుడు సాయం అవరసరమైన ద్రవిడ్ అండగా నిలిచాడు. ఏం జరిగినా.. జరగబోతున్నా.. పరుగులు చేయడానికే కట్టుబడి ఉండు" అని సలహా ఇచ్చాడని పేర్కొన్నాడు.

ద్రవిడ్ ఇచ్చిన సలహాను పాటించాను
"ద్రవిడ్ ఇచ్చిన సలహాను పాటించాను. ఇది నాకెంతో ఉంపయోగపడింది. నేనెప్పుడు కష్టపడితే ఫలితం ఉంటుందని నమ్ముతాను" అని మయాంక అగర్వాల్ వెల్లడించాడు. దేశవాళీ క్రికెట్‌లో భారత్-ఏ జట్టు తరుపున పరుగుల వరద పారించడంతో సెలక్టర్ల దృష్టిలో మయాంక్ అగర్వాల్ పడ్డాడు.

పృథ్వీ షాతో పోటీ ఉన్నా... అగర్వాల్‌వైపే మొగ్గు చూపే అవకాశం
ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌ల వరుస వైఫల్యాల నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌కు సెలక్టర్లు వెస్టిండిస్ పర్యటనలో చోటు కల్పించారు. అయితే, తుది జట్టులో చోటు కోసం పృథ్వీ షాతో పోటీ ఉన్నప్పటికీ, అనుభవం రీత్యా అగర్వాల్‌కే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications