Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఆటను చూస్తే భయమేస్తోంది: డబుల్ సెంచరీలపై కపిల్

హైదరాబాద్: వరుసగా ఆరు సిరిస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా విరాట్ కోహ్లీని మాజీ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ప్రశంసలతో ముంచెత్తాడు. తాను చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అని కొనియాడాడు.

కోహ్లీ ఒక క్రికెటర్ కాదని, క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, సర్ వివ్ రిచర్డ్స్‌ల కలబోత అని కొనియాడాడు. వరుసగా నాలుగు టెస్టు సిరిస్‌ల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లీ ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 23 నుంచి ఆరంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

8-10 టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు

8-10 టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు

'ఏ ఆటగాడైనా 10 టెస్టుల్లో 10 డబుల్ సెంచరీలు చేస్తాడని మనం ఊహించలేం. అయితే 8-10 టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేయడం నిజంగా ఓ అద్భుతం. హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో కోహ్లీ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని భావించా' అని కపిల్ అన్నాడు.

ఆస్ట్రేలియా సిరిస్‌లో ట్రిపుల్ సెంచరీ చేయాలి

ఆస్ట్రేలియా సిరిస్‌లో ట్రిపుల్ సెంచరీ చేయాలి

అప్పుడు మిస్ అయినా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరిస్‌లో ఇది సాధ్యం అవుతుందని అనుకంటున్నానని చెప్పాడు. ఇక, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ భీకర ఇన్నింగ్స్‌లు ఆడినా అతడి కంటే టెక్నికల్‌గా కోహ్లీనే బెటర్ అని కపిల్ దేవ్ తేల్చి చెప్పాడు.

బ్రాడ్‌మన్ ఆడితే అచ్చం కోహ్లీలానే ఉంటుంది

బ్రాడ్‌మన్ ఆడితే అచ్చం కోహ్లీలానే ఉంటుంది

భవిష్యత్తులో అందరూ ఆసీస్ క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్ మన్ కంటే ముందుగా కోహ్లీని కొలమానంగా చూస్తారని కపిల్ అభిప్రాయపడ్డాడు. 'డాన్ బ్రాడ్‌మన్ గురించి మనమంతా స్టోరీలు విన్నాం. ఆ రికార్డులను చూసి అతడు ఎలా బ్యాటింగ్ చేసి ఉంటాడో అనుకున్నాం. అయితే ఇప్పుడు బ్రాడ్‌మన్ ఆడితే అచ్చం కోహ్లీలానే ఉంటుంది' అని కపిల్ అన్నాడు.

కోహ్లీ ఆట చూస్తే భయమేస్తుంది

కోహ్లీ ఆట చూస్తే భయమేస్తుంది

కోన్ని సార్లు కోహ్లీ ఆట చూస్తే భయమేస్తుందని కపిల్ అన్నాడు. తక్కువ సమయంలో ఎన్నో రికార్డులను అతడు అధిగమిస్తున్నాడని కొనియాడాడు. అసాధారణ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తూ.. క్రికెట్‌ను మరో దశకు తీసుకెళ్తూ.. కొత్త సమీకరణాలను తెరపైకి తీసుకొస్తున్నాడని అన్నాడు.

సహచర ఆటగాళ్లను భలేగా ప్రోత్సహిస్తాడు

సహచర ఆటగాళ్లను భలేగా ప్రోత్సహిస్తాడు

'ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ఫోర్ కొట్టినప్పుడు.. వారిని ఏమనకుండా.. నీ పని నువ్వు చేయ్ అంటూ సహచర ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కోహ్లీ ఫిట్‌నెస్ అమోఘం. ఇందుకోసం అతడు ఎంతగానో శ్రమించాడని అతడి ఆటద్వారా నిరూపించుకున్నాడు' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+