సిడ్నీ: క్రికెడ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి భోజనం చేసే సదావకాశాన్ని ఆస్టేలియాలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ కల్పిస్తోంది. ఈ భోజనం ఖరీదు ఆస్టేలియన్ డాలర్లలో 1,500 నుంచి 3,000 వరకూ ఉంది. అయితే కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రెస్టారెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఫిబ్రవరి 26న (ఆదివారం)నాడు భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ అనంతరం 60 మందికి ఈ వీఐపీ డిన్నర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన రెస్టారెంట్ నిర్వాహకుడు మేరకు 'సచిన్ టెండూల్కర్‌తో వీఐపీ భోజన అనుభవం, మిమ్మల్ని స్వాగతిస్తున్నాం' అన్న ప్రకటనకు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు.
దీనిని ఒక ఈవెంట్ లాగా కాకూండా ప్రతి ఒక్కరూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో ప్రత్యేక విందు భోజనంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ఎంట్రీల ఆధారంగా ఎనిమిది మంది ప్రజల కోసం ప్రత్యేకంగా టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక విందులో ప్రీమియం వైన్‌తో పాటు స్పిరిట్స్‌ను కూడా ఉంచారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు ప్రత్యేకంగా కేటాయించిన టేబుల్ వద్ద 12 మంది వరకూ కూర్చోని ఆయనతో ముచ్చటించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. సచిన్‌తో ముచ్చటించే ఆ 12 మంది 3000 ఆస్టేలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఈ ప్రత్యేక విందుకు హాజరైన వారు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ప్రశ్నలు కూడా అడిగే వెసులుబాటుని కల్పించామన్నారు. ఇటీవల సచిన్ టెండూల్కర్ విడుదల చేసిన తన ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సంతకం చేసి వీరికి అందించనున్నారు.
ఈ ఈవెంట్ ద్వారా సమకూరిన డబ్బుని సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపారు. మెల్ బోర్న్‌లో మార్చి 29న జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్స్ సందర్భంలో కూడా మెల్ బోర్న్ సిటీలో ఇలాంటిదే మరొకటి నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.