సచిన్‌తో ఓపెనింగ్... బ్రెట్ లీ తొలి బంతిని ఎలా ఎదుర్కొనడంపై సెహ్వాగ్ ఆతృత!

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో మరోసారి ఓపెనింగ్ బ్యాటింగ్ ప్రారంభించేందుకు తాను ఎంతో ఆతృతగా ఉన్నట్లు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 లీగ్ పేరిట వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 16 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
మాజీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీకి ఇండియా ఆతిథ్యమిస్తోంది. ఇండియాలోని ముంబై, పుణే నగరాల్లో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన వివరాలను గురువారం అధికారికంగా ప్రకటించారు. భారత్‌కు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తుండగా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్‌లు ఆడనున్నారు.
ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ "రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లు ఆడుతున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అది ఎందుకు ఆడుతున్నారనేది? రహదారి భద్రత గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరిస్ ఆడుతున్నారు. ఇది మంచి చొరవ. సచిన్‌తో మళ్లీ ఓపెనింగ్... బ్రెట్ లీని ఎదుర్కోవటానికి నేను చాలా సంతోషిస్తున్నాను" అని అన్నాడు.

సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ కాంబినేషన్
సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో వీరిద్దరి జోడీ 2002-2012 మధ్య కాలంలో 93 ఇన్నింగ్స్‌ల్లో 42.13 యావరేజితో 3919 పరుగులు చేసింది. ఇందులో 12 సెంచరీ భాగస్వామ్యాలు ఉండగా... 18 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వీరిద్దరూ తొలిసారి జులై, 2014లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 200వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 50 ఓవర్ల మ్యాచ్‌లో ఆడారు. ఆ తర్వాత నవంబర్, 2015లో అమెరికాలో జరిగిన క్రికెట్ ఆల్ స్టార్స్ టీ20 టోర్నమెంట్‌లో ఓపెనర్లుగా రెండోసారి బరిలోకి దిగారు.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 లీగ్
ఇదిలా ఉంటే, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 లీగ్‌లో మొత్తం 75 మంది రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నారు. వెస్టిండిస్ జట్టుకు బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా జట్టుకు జాంటీ రోడ్స్, శ్రీలంకకు తిలకరత్నే దిల్షాన్, ఆ్రస్టేలియా జట్టుకు బ్రెట్ లీ కెప్టెన్లుగా వ్వవహారిస్తారు. వీరితో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్, ఆ్రస్టేలియా రిటైర్డ్ ప్లేయర్లు బ్రాడ్ హాగ్, సైమండ్స్ పాల్గొంటున్నారు.

మొత్తం 10 మ్యాచ్‌లు
ఈ లీగ్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ లీగ్‌కు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ లీగ్ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని రోడ్డు భద్రత అవగాహన కోసం పని చేస్తున్న"శాంత్ భారత్ సురక్షిత్ భారత్" అనే సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications