Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీడా మంత్రిగా మాజీ క్రికెటర్!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాజీ టీమిండియా పేసర్ అశోక్ దిండా నూతన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో, క్రీడా రంగంలో విశేష అనుభవమున్న దిండాకు ఈ పదవి దక్కింది. బీజేపీ మొత్తం 294 స్థానాలకు గాను 206 సీట్లను గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయ పరంపరలో దిండా మొయినా నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన, ప్రతిపక్ష హోదా నుంచి ఇప్పుడు నేరుగా కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు.

మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే సౌరవ్ సిక్దర్, మాజీ హాకీ స్టార్ భరత్ ఛెత్రి వంటి వారి నుంచి అశోక్ దిండాకు తీవ్ర పోటీ ఎదురైంది. క్రీడా రంగంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం, క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన బెంగాల్ క్రీడలకు మేలు చేస్తాయని భావించిన అధిష్టానం, దిండా వైపే మొగ్గు చూపింది.బెంగాల్ క్రీడా శాఖ బాధ్యతలు వరుసగా ఇద్దరు క్రికెటర్లకే దక్కడం విశేషం. గత తృణమూల్ ప్రభుత్వంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ క్రీడా మంత్రిగా ఉండగా, ఇప్పుడు అశోక్ దిండా ఆ బాధ్యతలను స్వీకరించారు. అశోక్ దిండా క్రికెట్ కెరీర్‌కు క్రీడాభిమానుల్లో గొప్ప గౌరవం ఉంది. 2008లో ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి, తనదైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు.

భారత్ తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడిన ఆయన, డొమెస్టిక్ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 420 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటారు. 2021లో క్రికెట్‌కు స్వస్తి చెప్పిన దిండా, ఇప్పుడు రాజకీయ మైదానంలో క్రీడా మంత్రిగా తన రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించారు.

Story first published: Saturday, May 9, 2026, 11:12 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+