Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాజీ క్రికెటర్ సంచలనం

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకోవడంలో ఎంతో కీలకపాత్ర పోషించిన మాజీ టెస్టు స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని తన తాజా పుస్తకం 'ద రాంగ్ యుఎన్'‌లో ప్రస్తావించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం తన వైవాహిక జీవితం చిందర వందర కావడంతో దిక్కుతోచని స్ధితిలో తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైనట్లు తన ఆటో బయోగ్రఫీలో భాగంగా రచించిన పుస్తకంలో బ్రాడ్ హాగ్ ఈ మేరకు పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి'ద రాంగ్ యుఎన్'‌ అనే పేరుతో సోమవారం తన ఆటో బయోగ్రఫీని బ్రాడ్ హాగ్ విడుదల చేశాడు. ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన వైవాహిక బంధం చిందర వందర కావడం, ఆ తర్వాత తాను మద్యానికి అలవాటు కావడంతో పాటు ఓ ఆఫీసు జాబ్ చూసుకోలేని పరిస్థితిని వివరించాడు.

Ex-Australia Spinner Brad Hogg Considered Suicide, Reveals New Book

'ఆత్మహత్య చేసుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నా. దానిలో భాగంగా కారును ఫ్రెమెంటల్స్ పోర్ట్ బీచ్ వద్ద పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లా. అలా సముద్రాన్ని, అందులోని నీటిని చూస్తూ కూర్చున్నా. అయితే నాకు ఈత రావడంతో నీటిలో పడి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనుకున్నా' అని హాగ్ పేర్కొన్నాడు.

'ఆ తర్వాత ఆ ఆలోచనను ఆ ఆలోచనను విరమించుకుని వచ్చేశా. విధి ఏం నిర్ణయిస్తుందో చూద్దం అనుకున్నా. మరోసారి చీకటి ప్రదేశంలోకి వెళ్లి ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అప్పుడే ఆలోచించడం వేరు, చేయడం వేరు అనే విషయం అప్పుడే నాకు బోధ పడింది. ఆత్మహత్య అనే విషయాన్ని పక్కను పెట్టి నా అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యా' అని హాగ్ తెలిపాడు.

ఏడు టెస్టులతో పాటు 2003, 2007లలో ఆస్ట్రేలియా సాధించిన వన్డే వరల్డ్ కప్ జట్టులో హాగ్ కీలక పాత్ర పోషించాడు. 2007-2008 సీజన్‌లో అన్ని ఫార్మెట్ల నుంచి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తన మాజీ భార్య ఆండ్రియా ద్వారా వైవాహిక జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్లు హాగ్ తెలిపాడు.

ఆ అనుభవాల మూలంగా తాను ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చినట్లు హాగ్ తాజా పుస్తకంలో వెల్లడించాడు. వన్డేల్లో 2.25 యావరేజితో బ్రాడ్ హాగ్ వన్డేల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున బరిలోకి దిగాడు.

ఈ టోర్నీలో అత్యధిక వయసు కలిగిన వెటరన్ ఆటగాడిగా బ్రాడ్ హాగ్ గుర్తింపు పొందాడు. 45 ఏళ్ల వయసున్న బ్రాడ్ హాగ్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో మెల్ బోర్న్ రెనెగేడ్స్‌ తరుపున ఆడుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+