Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీ రికార్డ్.. జస్ట్: విండీస్ సిక్స్‌ల రికార్డ్, 'ఇదే ట్వంటీ 20 అంటే'

ఫ్లోరిడా: అంతర్జాతీయ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు, అమెరికా ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ ద్వారా మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

ధోనీకి ఇది కెప్టెన్‌గా 325వ గేమ్. మూడు ఫార్మాట్లలో ధోనీ కంటే ఎక్కువ మ్యాచులు ఆడింది రికీ పాంటింగ్. ఇప్పుడు శనివారం నాడు జరిగిన మ్యాచ్ ద్వారా పాంటింగ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. 71 ట్వంటీలకు, 60 టెస్టులకు, 194 వన్డేలకు ఇతను కెప్టెన్‌గా వ్యవహరించాడు.

యువరాజ్ సింగ్ రికార్డ్ సేఫ్

భారత్ - వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచులో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. విండీస్ బ్యాటింగ్ సమయంలో పదకొండవ ఓవర్‌ను స్ట్రాట్ బిన్నీ వేశాడు. ఈ ఓవర్లో సెంచరీ హీరో ఎవిన్ లూయిస్ ఏకంగా 31 పరుగులు చేశాడు.

MS Dhoni

మొదటి రెండు బంతులకు సిక్సు కొట్టాడు. మూడో ఓవర్‌ను బిన్నీ వైడ్‌గా వేశాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సులు కొట్టాడు. చివరి బంతికి కూడా ఎవిన్ లూయిస్ సిక్స్ కొడితే యువరాజ్ సింగ్ సరసన చేరేవాడు. కానీ చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. మొత్తంగా బిన్నీ వేసిన 11వ ఓవర్లో 32 పరుగులు విండీస్ పిండుకుంది.

21 సిక్సులతో ప్రపంచ రికార్డు

విండీస్ ఈ మ్యాచులో 21 సిక్సుకులు కొట్టింది. దీంతో ట్వంటీ 20లో అత్యధిక సిక్సులు కొట్టిన టీంగా రికార్డ్ సృష్టిటించింది. ఎవిన్ లూయిస్ శతకానికి 48 బంతులు తీసుకున్నాడు. మూడు బంతులు తక్కువ తీసుకుంటే.. ట్వంటీ 20ల్లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన రిచర్డ్ లెవీని సమం చేసేవాడు. విండీస్ ఇన్నింగ్సులో 178 పరుగులు బౌండరీల ద్వారా వచ్చాయి. అందులో 21 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి.

ట్వంటీ 20 అంటే ఇదేనేమో...

ప్లోరిడాలో భారత్ -విండీస్ మధ్య జరిగిన తొలి ట్వంటీ 20లో గెలుపుపై అభిమానుల అంచనాలు అన్ని తారుమారయ్యాయి. తొలుత విండీస్ చేసిన స్కోర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భారత్ ఓటమి ఖాయమన్నారు. ఆ తర్వాత, భారత్ ఆరంభంలో అంతగా ఆకట్టుకోకపోయినా.. ఆ తర్వాత చెలరేగడంతో విండిస్ ఓటమి ఖాయమని అందరూ ఖరారు చేసుకున్నారు.

చివరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులో సెంచరీ హీరో కెఎల్ రాహుల్, కెప్టెన్ ధోనీ ఉన్నాడు. దీంతో భారత్ గెలుపు పైన ఎవరికీ అనుమానం లేదు. చివరి ఐదు బంతుల్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆరో బంతికి ధోనీ అవుటయ్యాడు. దీంతో అంతా రివర్స్ అయింది. ధోనీ ఉసూరుమనిపించాడని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే ట్వంటీ 20 అంటే అని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+