Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిక్సులతో లెవిస్ వీరవిహారం.. లక్ష్యం దిశగా సెయింట్ కిట్స్!!

Evin Lewis Half Century helps St Kitts and Nevis Patriots to reach Target

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్లో భాగంగా బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుతో జరుగుతన్న మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ ఓపెనర్ ఎవిన్ లెవిస్ అద్భుతంగా ఆడుతున్నాడు. సిక్సులతో వీరవిహారం చేస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. హేడెన్ వాల్ష్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సులు బాది హాఫ్ సెంచరీ చేశాడు. 28 బంతుల్లోనే లెవిస్ అర్ధ శతకం చేశాడు. లెవిస్ సిక్సుల ధాటిగా బార్బడోస్ ట్రైడెంట్స్ బౌలర్లు చేతులెత్తేశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. జాన్సన్ చార్లెస్ బౌండరీలతో చెలరేగాడు. నాలుగు ఫోర్లు బాది 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు షై హోప్ నెమ్మదిగా ఆడాడు. 11 బంతులాడి కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆపై కుదురుకుని 30 బంతుల్లో 29 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. కె మేయర్స్ (22), కోరే ఆండర్సన్ (31), ఆష్లే నర్సు (25) ఆదుకోవడంలో ట్రైడెంట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. జగ్గేసర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుకు ఓపెనర్లు అదిరే శుభారంభం ఇచ్చారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్ (16) క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారించాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. మరో ఓపెనర్ ఎవిన్ లెవిస్ కూడా ట్రైడెంట్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ జోడి 34 రన్స్ జోడించిన అనంతరం లిన్ పెవిలియన్ చేరాడు. ఆపై జాషువా డా సిల్వా (1) కూడా ఔట్ అయ్యాడు.

ఈ సమయంలో బార్బడోస్ ట్రైడెంట్స్ బౌలర్లకు లెవిస్ చుక్కలు చూపించాడు. ఫోర్లు, ఓ సిక్సులు బాదాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక హేడెన్ వాల్ష్ బౌలింగ్లో వరుసగా మూడు సిక్సులు బాది హాఫ్ సెంచరీ చేశాడు. 28 బంతుల్లోనే లెవిస్ అర్ధ శతకం చేశాడు. ఆపై కూడా లెవిస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. అయితే అతనికి అండగా నిలిచిన దేనేష్ రామ్‌దిన్ (20) నెమ్మదిగా ఆడి ఔట్ అయ్యాడు. సెయింట్ కిట్స్ 17 ఓవర్లలో మూడు వికెట్లను 121 పరుగులు చేసింది. 3 ఓవర్లలో 31 రన్స్ చేయాలి. క్రీజులో లెవిస్ ఉన్నాడు.

Story first published: Tuesday, August 25, 2020, 23:05 [IST]
Other articles published on Aug 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+