'నిజాయతీగా మాట్లాడుతాడు కాబట్టే కోహ్లీని అందరూ అభిమానిస్తారు'


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిజాయతీగా మాట్లాడుతాడు కాబట్టే అతడ్ని అందరూ అభిమానిస్తారని ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా షేన్‌వార్న్ ఆదివారం ఎంపికైన విషయం తెలిసిందే.
2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్‌లో కెప్టెన్‌గా రాజస్థాన్ జట్టుకి టైటిల్‌ను అందించిన షేన్‌వార్న్ గత ఏడాది ఆ జట్టుకి మెంటార్‌గా పనిచేశాడు. తాజాగా ఆ జట్టు జెర్సీ రంగుని బ్లూ నుంచి పింక్‌కి మార్చుకున్న సందర్భంగా షేన్ వార్న్
ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయకత్వం, సమర్దవంతమైన సారథ్యం, లీడర్ ఆప్ ద టీమ్ తదితర అంశాల గురించి మీడియాతో మాట్లాడాడు.

కోహ్లీకి అభిమానిని
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను అభిమానినని చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. అతని బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కోహ్లీకి నేను పెద్ద అభిమానిని.. అతను మాట్లాడుతుంటే అలానే వింటుంటా. విరాట్ ఏం చెప్తాడో..? అదే చేస్తాడు. దాపరికం లేకుండా నిజాయతీగా మాట్లాడటం అతని నైజం" అని వార్న్ తెలిపాడు.

మైదానంలో ఎక్కువ భావోద్వేగాలకి
"అయితే.. మైదానంలో ఎక్కువ భావోద్వేగాలకి గురవుతుంటాడు. ఆటలో అతని దూకుడికి అదే నిదర్శనం. తప్పిదాలను కూడా కోహ్లీ బహిరంగంగా మాట్లాడగలడు. అందుకే లక్ష్యఛేదనల్లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో అసాధారణ శతకాలు సాధించగలుగుతున్నాడు" అని షేన్ వార్న్ పేర్కొన్నాడు.

కోహ్లీ ముందుండి నడిపిస్తున్న తీరు బాగుంది
"భారత జట్టును కోహ్లి ముందుండి నడిపిస్తున్న తీరు బాగుంది. కానీ సమర్ధవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు. ఒక జట్టుకు సరైన వ్యూహ రచన చేస్తూ నడిపిస్తున్న ప్రస్తుత కెప్టెన్ల జాబితాలో విలియమ్సన్, టిమ్ పైన్‌లే కోహ్లి కంటే మెరుగ్గా ఉన్నారు. కోహ్లీ కంటే వారిద్దరే సమర్దవంతమైన కెప్టెన్లు అనేది నా అభిప్రాయం" అని వార్న్ తెలిపాడు.

ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్
మరోవైపు ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు బ్లూ జెర్సీలతో ఆడిన ఆ జట్టు ఈ సీజన్‌లో పింక్ జెర్సీలు ధరించనుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. భారత్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ జట్టు ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications