కెప్టెన్‌గా కోహ్లీకి కష్టమే: స్మిత్ వ్యాఖ్యలపై కోహ్లీ స్పందన ఇదీ
హైదరాబాద్: కెప్టెన్‌గా ప్రతిరోజూ తాను ఏదో ఒకటి నేర్చుకూనే ఉంటానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌స్మిత్ సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున కోహ్లీ సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరిస్తాడో లేడో చెప్పలేనని అన్నాడు. బుధవారం మూడో టెస్టు నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రేమ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'ప్రతి గేమ్‌లో గెలిచినా, ఓడినా నేర్చుకునేందుకు గాను ఓ గొప్ప అనుభవం. తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగడమే నా లక్ష్యం. ఈ పరిస్థితుల్లో మనం ఆటపై దృష్టి పెట్టాలి. ఇది కొత్త ఏమీ కాదు' అని కోహ్లీ అన్నాడు.

ప్రతి రోజూ నేర్చుకుంటూనే ఉన్నా
'ప్రతి రోజూ నేర్చుకుంటూనే ఉన్నా. ఏ స్టేజిలోనైనా నేర్చుకోవడం ఆపకూడదు. ఆటలో గెలిచినా, ఓడినా నేర్చుకుంటూనే ఉండాలి. ఏవైనా తప్పులు జరిగాయో ఆ తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత తీసుకోవాలి. గేమ్‌లో పాజిటివ్స్‌ను ఎప్పుడూ మైండ్‌లో పెట్టుకోవాలి' అని కోహ్లీ వాండరర్స్ స్టేడియంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు పది రోజులు ముందుగా వచ్చి ఉంటే ఇంకా బాగుండేదన్న కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలతో కోహ్లీ విభేదించాడు. 'ఈ సిరీస్‌కు మేం సరిగా సన్నద్ధం కాలేదని నేను భావించట్లేదు. టెస్టు సిరీస్‌లో ఓడిపోయాక సన్నాహాన్ని వేలెత్తి చూపను. సిరీస్‌కు సన్నద్ధం కావడానికి మాకు వారం సమయం లభించింది' అని కోహ్లీ అన్నాడు.

తప్పులు, మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే
'కూర్చుని, బయటి అంశాలు మా ఓటములుకు కారణమని ఆలోచించం. సఫారీ టెస్టు సన్నాహాకానికి వారం రోజుల సమయం ఉంది. అందులో ఒకరోజు మేం ట్రావెల్ చేశాం. మా తప్పులు, మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఈ సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్నాం' అని కోహ్లీ చెప్పాడు. ఇక, మూడో టెస్టులో పూర్తిగా పేస్ బౌలర్లతో బరిలో దిగే అవకాశముందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 'పిచ్‌పై చాలా పచ్చిక ఉంది. కచ్చితంగా ఐదుగురు పేసర్లతో ఆడే అవకాశాన్ని పరిశీలిస్తాం' అని కోహ్లీ అన్నాడు.

బుధవారం మధ్యాహ్నాం 1.30 గంటలకు మూడో టెస్టు
ఇరు జట్ల మధ్య ఈ సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టు బుధవారం మధ్యాహ్నాం 1.30 గంటలకు వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే సఫారీ గడ్డపై ఇప్పటివరకు టీమిండియా వైట్ వాష్ అవ్వలేదు. భారత జట్టు 1992 నుంచి 6 సార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. సచిన్ కెప్టెన్సీలో 1996-97లో మూడు టెస్టుల సిరీస్‌లో 0-2తో ఓటమే ఇప్పటి వరకు అత్యంత చెత్త ప్రదర్శన కావడం విశేషం. 2006 నుంచి కనీసం ఒక టెస్టు అయినా గెలవడమో లేదంటే డ్రా చేసుకోవడమో జరుగుతూ వస్తోంది. మూడో టెస్టు జరిగే వాండరర్స్‌లో భారత్ ఇప్పటివరకు ఓడిపోలేదు.

వాండరర్స్‌లో ఓటమి ఎరుగుని టీమిండియా
ఈ స్టేడియంలో భారత్ నాలుగు టెస్టులు ఆడగా... అందులో ఒకదాంట్లో విజయం సాధించగా, మూడు టెస్టులు డ్రాగా ముగిశాయి. 1992 నవంబర్, 1997 జనవరి, 2006 డిసెంబర్, 2013 డిసెంబర్‌లో ఇక్కడ మ్యాచ్‌లు ఆడింది. టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (8/99) అద్భుత ప్రదర్శన చేయడంతో ద్రవిడ్ కెప్టెన్సీలో 2006లో భారత్ విజయం సాధించింది. 11 ఏళ్ల తర్వాత ఇక్కడ అడుగుపెడుతున్న కోహ్లీసేన మాత్రం కనీసం డ్రానైనా చేస్తుందా లేదా అన్న సందేహాలు ఇప్పుడు అభిమానులకు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications