ప్రపంచకప్ ఓటమిపై తొలిసారి నోరువిప్పిన విరాట్ కోహ్లీ

India vs West Indies Series 2019, Ist T20I : Virat Kohli Finally Responded On World Cup Exit

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌ నిష్క్రమణపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు నోరువిప్పాడు. న్యూజిలాండ్‌‌తో జరిగిన తొలి సెమీస్‌లో ఓటమి తర్వాత కొన్ని రోజులు భారంగా గడిచాయని, ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్‌ తర్వాత మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉన్న టీమిండియా మళ్లీ సమరానికి సిద్ధమైంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా తొలి టీ20కి సన్నద్ధమైంది. తొలి టీ20 నేపథ్యంలో మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు.

ధోనీ గైర్హాజరీ పంత్‌కు గొప్ప అవకాశం: తొలి టీ20కి ముందు కోహ్లీ

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "ప్రపంచకప్‌ ముగిసేవరకూ నిద్రలేచిన ప్రతీ ఉదయం ఆ పరాభవమే గుర్తొచ్చేది. ఆ తర్వాత రోజు వారీ కార్యక్రమాల్లో బిజీ కావడంతో ప్రపంచకప్ ఓటమని మర్చిపోయేందుకు ప్రయత్నించాం. మేం ప్రొపెషనల్ ప్లేయర్లం. జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించాలి" అని చెప్పాడు.

ఏదైతే జరిగిందో అది మంచిదే

ఏదైతే జరిగిందో అది మంచిదే

"ప్రపంచకప్‌లో ఏదైతే జరిగిందో అది మంచిదే. నిన్న ఫీల్డింగ్ సెషన్‌లో మేము మైదానంలో గడిపిన కొద్ది సమయం చాలా బాగుంది. అందరూ ఉత్సాహంగా ఉన్నారు, కేవలం ఆట కోసం ఎదురు చూస్తున్నారు. అందరం మళ్లీ మైదానంలో కలిసాం. ఒక జట్టుగా మీము చేయగలిగిన ఉత్తమమైన పని ఇదేనని నేను భావిస్తున్నాను. వీలైనంత త్వరగా పార్కులో చేరండి" అని కోహ్లీ అన్నాడు.

జో రూట్ లక్కీ: బంతి బెయిల్స్‌ను తాకినా కింద పడలేదు (వీడియో)

ఇదొక చక్కటి అవకాశం

ఇదొక చక్కటి అవకాశం

ఇక, వెస్టిండిస్ పర్యటన నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకోవడం... యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ తనలోని నైపుణ్యాన్ని బయటపెట్టడానికి ఇదొక చక్కటి అవకాశమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. మిడిలార్డర్‌లో పంత్‌ రాణించాలని, అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతి

హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతి

వెస్టిండిస్ పర్యటనకు సెలక్టర్లు ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. ధోనీ రెండు నెలలుపాటు ఆర్మీకి సేవలందించడం కోసం క్రికెట్‌కు దూరమయ్యాడు. మరోవైపు వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో పలువురు యువ క్రికెటర్లకు ఈ పర్యటనలో సెలక్టర్లు అవకాశమిచ్చారు.

యాషెస్ తొలి టెస్టులోనే బర్న్స్‌ సెంచరీ: గత 100 టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఇది ఐదోది

నెల రోజుల పాటు విండిస్ పర్యటన

నెల రోజుల పాటు విండిస్ పర్యటన

విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా వెస్టిండిస్‌తో నెల రోజుల పాటు సుదీర్ఘ సిరిస్‌లో తలపడనుంది. శనివారం, ఆదివారం రెండు టీ20 మ్యాచ్‌లు ఫ్లోరిడాలోని సెంట్రల్‌ బ్రోవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియంలో జరగనుండగా... ఆగస్టు 6న గుయానా వేదికగా మూడో టీ20 జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టు సిరిస్ జరగనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, August 3, 2019, 12:59 [IST]
Other articles published on Aug 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X