కోహ్లీ జెర్సీపై ఉన్న మూడు స్టార్లు దేన్ని సూచిస్తాయో తెలుసా?
హైదరాబాద్: ఒప్పొ కొత్త జెర్సీల్లో కోహ్లీసేన గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. రాయల్ బ్లూ రంగులో మెరిసిపోతున్న ఈ జెర్సీలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు గీతలు భారత త్రివర్ణ పతాకాన్ని చిహ్నంగా పొందుపరిచారు.
అదే విధంగా జెర్సీకి కుడివైపున్న బీసీసీఐ లోగోపై మూడు నక్షత్రాలను ముద్రించారు. అయితే ఈ మూడు నక్షత్రాలు ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా. ఈ మూడు నక్షత్రాలు దేనిని సూచిస్తున్నాయో తెలుసా. ఈ మూడు నక్షత్రాలు టీమిండియా సాధించిన మూడు వరల్డ్ కప్‌లకు చిహ్నాలు.

మైదానంలో ఆటగాళ్లకు స్ఫూర్తి నింపేందుకు గాను ఈ మూడు నక్షత్రాలను జెర్సీలో రూపొందించారు. కాగా, టీమిండియా ఇప్పటివరకు రెండు వన్డే వరల్డ్ కప్‌లను గెలుచుకోగా, ఒక టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. నిజానికి ఈ సంప్రదాయం పుట్‌బాల్‌లో ఎప్పటి నుంచో ఉంది.
బ్రెజిల్, ఇటలీ సాకర్ జట్ల జెర్సీలపైనా ఇలాగే నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు ఆయా జట్లు సాధించిన ప్రపంచకప్‌ల చిహ్నాలను సూచిస్తుంటాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications