'కోహ్లీ లేకపోయినా భారత్.. ప్రపంచ అత్యుత్తమ జట్టే'

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా కెప్టెన్ అనారోగ్య రీత్యా విరామం తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు అనంతరం జరగనున్న ఆసియా కప్ 2018లోనూ అతని స్థానాన్ని రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తూ భర్తీ చేయనున్నాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో లేకపోయినా భారత్ జట్టు వరల్డ్ క్లాస్ టీమ్ అని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఫహీమ్ అష్రఫ్ అభివర్ణించాడు.

రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించి
యూఏఈ వేదికగా సెప్టెంబరు15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుండగా.. భారత్, పాకిస్థాన్ జట్లు 19న ఢీకొననున్నాయి. ఈ టోర్నీ నుంచి కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతని స్థానంలో రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆసియా కప్ కోసం ఇప్పటికే యూఏఈకి చేరుకున్న పాకిస్థాన్ టీమ్ ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్ చేస్తోంది.

పాకిస్థాన్ జట్టు నెట్స్‌లో కఠినంగా
యూఏఈ పరిస్థితుల్ని అలవాటు చేసుకునేందుకు పాకిస్థాన్ జట్టు నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తోంది. భారత్‌పై మ్యాచ్ ఆడి.. అందులో మెరుగైన ప్రదర్శన చేయాలని పాక్ జట్టులోని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారు. విరాట్ కోహ్లీ జట్టులో లేకపోయినా టీమిండియా వరల్డ్ క్లాస్ టీమ్. కాబట్టి.. ఆ జట్టుని మేము తేలిగ్గా తీసుకోవడం లేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత్‌పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం'.

సెప్టెంబర్ 18 నుంచి హాంగ్‌కాంగ్‌తో తొలి మ్యాచ్:
వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. ఆసియా కప్ 2018 టోర్నీలో టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 18 నుంచి హాంగ్‌కాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టులో భాగమైంది. ఈ టోర్నీకి వేదికలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్, అబు దాబిలు కానున్నాయి.

ఆరింటిలో భారత్ విజేతగా:
టోర్నమెంట్‌లో ఉన్న గ్రూపులు రెండు ఏ, బీ. ఇందులో గ్రూపు ఏ కు సంబంధించి ఇండియా, పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ . గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. కాగా, భారత్ ఈ టోర్నీలో ఆరు సార్లు టైటిల్ గెలుచుకోగా, శ్రీలంక ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ విజేతగా నిలిచిన ఆరింటిలో మూడు సార్లు ఫైనల్ పోరులో శ్రీలంకతోనే పోరాడటం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications