For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunil Gavaskar: భువీ, షమీ, బుమ్రా ఉన్నా.. హర్షల్ పటేల్‌ను కూడా వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలి

Even Though Seniors like Bhuvi, Shami and Bumrah There, Harshal Patel Need to include in WC squad

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ‌ కప్‌లో ట్రంప్‌కార్డ్‌ ప్లేయర్‌గా హర్షల్ పటేల్ ఉంటాడని, అతను జట్టులో కచ్చితంగా ఉండాల్సిన ప్లేయర్ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకపోతే ఐపీఎల్ 2021 సీజన్లో రాణించిన తర్వాత హర్షల్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. పటేల్ గత కొన్నేళ్లుగా కన్సిస్టెన్సీతో బౌలింగ్ వేస్తున్నాడు. ఐపీఎల్ 2021లో 32వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ కూడా గెలుచుకున్నాడు. అతని గతేడాది న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి టీమిండియా టీ20 జట్టు సెటప్‌లో భాగమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో అత్యధిక వికెట్లు (7) తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు.

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ బౌలర్లు గైర్హాజరైన టైంలో హర్షల్ పటేల్ వారి స్థానాన్ని భర్తీ చేసేలా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇక హర్షల్ పటేల్ గురించి గవాస్కర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ సందర్భంగా 31ఏళ్ల హర్షల్.. ట్రంప్ కార్డ్‌ అందుకునే ప్లేయర్ అవుతాడు. హర్షల్ పటేల్ తన స్మార్ట్ బౌలింగ్, వైవిధ్యమైన బంతులతో పవర్‌ప్లే మరియు స్లాగ్ ఓవర్‌లలో సమర్థవంతంగా బౌలింగ్ చేయగలడు. కాబట్టి అతనిలాంటి బౌలర్ కెప్టెన్‌కి తప్పకుండా అవసరమైన టైంలో పనికొస్తాడని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

'టీమిండియాకు భువనేశ్వర్, షమీ, బుమ్రా లాంటి నిఖార్సైన బౌలర్లు ఉన్నప్పటికీ.. హర్షల్ పటేల్ కూడా టీ20 వరల్డ్ కప్ సెటప్‌కు అవసరమైన ప్లేయరే అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా భారత టీ20 ప్రపంచ కప్ జట్టులో హర్షల్ పటేల్‌ ఉండాలని పేర్కొన్నాడు. ఒత్తిడి టైంలో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం కారణంగా అతను జట్టుకు పెద్ద ఆస్తిగా మారతాడని అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, June 21, 2022, 20:31 [IST]
Other articles published on Jun 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+