పంత్‌లాగే ధోని కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో క్యాచ్‌లు వదిలేశాడు


హైదరాబాద్: మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినప్పటికీ... దానిని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అయితే, టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే.
మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు లాగేసుకున్న ఆస్టన్ టర్నర్‌ను స్టంపింగ్ చేసే విషయంలో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన పొరపాటు కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణం. ఆస్టన్ టర్నర్‌ను రెండు సార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా రిషభ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ధోనీలా రనౌట్ చేయడానికి ప్రయత్నించి
ధోనీలా రనౌట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో సైతం రిషభ్ పంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతీ ఒక్కరూ ధోనీ కాలేరబ్బా అంటూ రిషబ్ పంత్‌ను ఒక ఆట ఆడుకున్నారు. రిషబ్ పంత్‌పై తీవ్ర విమర్శలు నేపథ్యంలో అతడి కోచ్ తారక్ సిన్హా మద్దతుగా నిలిచాడు.

పంత్ కోచ్ తారక్ సిన్హా మాట్లాడుతూ
తాజాగా పంత్ కోచ్ తారక్ సిన్హా మాట్లాడుతూ "పంత్, ధోనీతో ఇద్దరూ వికెట్ కీపింగ్‌తోపాటు బ్యాటింగ్ కూడా చేయగలరు. అంతమాత్రాన వీరిద్దరినీ పోల్చడం సరికాదు. అలా చేస్తే రిషభ్ పంత్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే మొహాలీ వన్డేలో జరిగింది. ఎప్పుడైతే అతడు ఒత్తిడి లేకుండా ఆడగలడో అతడి నుంచి మంచి ఆటను రాబట్టగలం" అని అన్నాడు.

పద్నాలుగేళ్ల క్రితం ధోనీ కూడా ఇలానే
"పంత్ కీపింగ్ సరిగా చేయలేదని అంటున్నారు. పద్నాలుగేళ్ల క్రితం ధోనీ కూడా తన తొలినాళ్లలో ఇలాగే ఇబ్బందులు పడ్డాడు. అప్పుడు అతడు బోలెడు క్యాచ్‌లు వదిలేశాడు. స్టంపింగ్‌లు కూడా సరిగా చేయలేకపోయాడు. వాస్తవానికి ధోనీ క్రికెట్‌లో అడుగుపెట్టిన సమయంలో లెజెండరీ కీపర్లు లేరు. దినేష్ కార్తీక్, పార్థీవ్ పటేల్ ఉన్నా వాళ్లంతా ధోనీ కంటే చిన్నవాళ్లే. అందుకే అతడు ఒత్తిడి లేకుండా ఆడేవాడు" అని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications