Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లండన్ వీధుల్లో భార్య అనుష్కతో కారులో కోహ్లీ చక్కర్లు (ఫోటోలు)

Even inside a dark car, Anushka Sharma and Virat Kohli radiate glow and positive vibes

హైదరాబాద్: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో లండన్‌ వీధుల్లో షికార్లు చేస్తున్నాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

మూడు వన్డేల సిరిస్ ముగియడంతో అనంతరం లభించిన విరామంతో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో జాలీగా గడిపాడు. ఈ సందర్భంగా కారులో షికారు చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Even inside a dark car, Anushka Sharma and Virat Kohli radiate glow and positive vibes

ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన... అనంతరం జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 2-1తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఎంతో కీలకమైన టెస్టు సిరీస్‌ ఆగస్టు 1నుంచి ఆరంభం కానున్నది.

ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ రెండు అర్ధ సెంచరీలను మాత్రమే నమోదు చేశాడు. గతంలో 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన కోహ్లీసేన తాను ఆడిన ఐదు టెస్టులలో 13.40 సగటుతో 134 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ పర్యటనలోనైనా సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో కోహ్లీ ఉన్నాడు.

Even inside a dark car, Anushka Sharma and Virat Kohli radiate glow and positive vibes

వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ తన భాగస్వామి దీపికా పల్లికల్‌తో కలిసి డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌కు వెళ్లారు. బ్యాచిలర్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యతో కలిసి కృనాల్ పాండ్య తమకు నచ్చిన ప్రదేశాలకు సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఇండియన్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ తన సోదరుడితో కలిసి ఇంగ్లాండ్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ స్టేడియాన్ని సందర్శించారు.

Story first published: Saturday, July 21, 2018, 10:47 [IST]
Other articles published on Jul 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+