
సిడ్నీ: భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అనగానే- కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోంటారు. ఈ రెండు జట్ల మధ్య నెలకొనే పోటీతత్వానికి ఉన్న క్రేజ్ వేరు. మరే జట్టుకూ అలాంటి మాస్ ఫాలోయింగ్ ఉండదు. లక్షలాది మంది అభిమానులు మ్యాచ్‌ను తిలకించడానికి ఎగబడుతుంటారు. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా ఈ నెల 23వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా ప్రేక్షకులకు వీక్షించారు. ఎంసీజీ పూర్తి సామర్థ్యం లక్ష. లక్ష మంది ఒకేసారి మ్యాచ్‌ను తిలకించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా టికెట్లు అమ్ముడయ్యాయి. 90 వేలకు పైగా టికెట్లను విక్రయించినట్లు వెల్లడించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అదో రికార్డు. ఇదివరకు చాలా అరుదుగా మాత్రమే ఈ స్థాయిలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిస్థాయిలో నిండింది.
సాధారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చాలా అరుదుగా జరుగుతుంటుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్లల్లో తప్ప ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండవు. అలాంటిది ఈ రెండు నెలల వ్యవధిలో ఈ రెండు దేశాలు తలపడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఆసియా కప్ 2022 తరువాత రెండు నెలల వ్యవధిలో మళ్లీ భారత్ - పాకిస్తాన్ ఎదురుపడ్డాయి.

ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ మీద కూడా రికార్డు స్థాయిలో వీవర్స్ ఉన్నారీ మ్యాచ్‌కు. హాట్‌స్టార్‌పై ఏకంగా కోటీ 10 లక్షల మంది మ్యాచ్‌ను తిలకించారు. అనంతరం ఇది కోటీ 80 లక్షల వరకూ వెళ్లింది. రికార్డుస్థాయి వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో లైవ్ టెలికాస్ట్ చేయడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఫారూఖ్ ఇంజినీర్ కూడా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పట్ల స్పందించారు. ఈ రెండు జట్లు ఆడుతున్నాయంటే తాను ఎక్కడికైనా వెళ్తానని వ్యాఖ్యానించారు. అంగారక గ్రహంపై ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే తాను అక్కడికైనా సరే వెళ్తానని పేర్కొన్నారు.
ఆసియా కప్ 2022లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సిరీస్ అద్భుతమని ఫరూఖ్ ఇంజినీర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఈ మ్యాచ్‌ను తాను తరచూ తిలకిస్తుంటానని చెప్పారు. పాకిస్తాన్ జట్టు ప్రతి టీమ్‌తోనూ ఆడుతారని తాను ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. దుబాయ్, ఇంగ్లండ్ ఇలా టీమిండియా ఎక్కడ ఆడినా తాను సపోర్టర్‌గా వెళ్తానని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ అనేది రెండు ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడి ఉందని అన్నారు.