హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్: ఆసక్తికర విషయం వెల్లడి
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ ఐకాన్ కపిల్ దేవ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 'లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయన చోటు దక్కించుకున్నారు. లెజెండ్స్ క్లబ్ అధ్యక్షుడు మాధవ్ ఆప్టే దీనిని కపిల్‌కు బహూకరించారు.
దీంతో భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, నారీ కాంట్రాక్టర్, అజిత్ వాడేకర్ సమక్షంలో కపిల్ దేవ్ జ్ఞాపికను అందుకున్నారు. గవాస్కర్ కూడా వాడేకర్ చేతుల మీదుగా ఈ జ్ఞాపికను అందుకున్నారు. 1983 వరల్డ్ కప్ జట్టుకు కపిల్ దేవ్ సారధిగా ఉన్నాడు.

కపిల్ వెల్లడించిన ఆసక్తికర విషయం
ఈ సందర్భంగా తన పెళ్లికి ముందు నాటి రోజులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘నా భార్య రోమీ తాతయ్యను కలవడానికి వెళ్లినపుడు ఆయన నేనేం చేస్తుంటానని అడిగారు. క్రికెట్ ఆడతానని చెబితే క్రికెట్ ఆడతావు సరే, ఏం పని చేస్తావు అని మళ్లీ రెట్టించి అడిగారు' అని కపిల్ నవ్వాడు.

శిక్షణ ఇచ్చేందుకు ఎవరూ ఉండేవారు కాదు
ఇక తమ చండీగఢ్‌లో టర్ఫ్ వికెట్లు కూడా ఉండేవి కావని, శిక్షణ ఇచ్చేందుకు కూడా ఎవరూ ఉండేవారు కాదని కపిల్ గుర్తుచేసుకున్నాడు. అయితే ముంబైలో ఆధునిక శిక్షణ దొరికేదని చెప్పాడు. అవార్డులు, రివార్డులు కోసం తాము క్రికెట్ ఆడలేదని, క్రికెట్ అంటే తమకు అమితమైన ప్రేమ అని చెప్పాడు.

ఎంతో గర్వంగా ఉండేది
ఎంతో మంది క్రికెట్ ఆడేందుకు వచ్చారని, ఆ తర్వాత పోయారని అయితే గవాస్కర్ అనే పేరు మాత్రం ఇప్పటికీ టాప్ లోనే ఉందని అన్నాడు. మా విజయంతో అభిమానులు సంతోషానికి గురైతే అది ఎంతో గర్వంగా ఉండేదని తెలిపాడు. ఇక కపిల్ దేవ్‌తో కలిసి ఒకే జట్టులో ఆడడం తనకు దక్కిన గౌరవమని గవాస్కర్ తెలిపాడు.

కపిల్ గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్
కపిల్ దేవ్‌ని భారత్ యొక్క గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్‌గా గవాస్కర్ అభివర్ణించాడు. టెస్టుల్లో 400 వికెట్లు తీసుకున్న తొలి భారత క్రికెటర్ కపిల్ దేవ్ కాగా, పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్. జులై 11, 2013నే గవాస్కర్ ‘లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయన చోటు దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications