For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంఫైర్‌గా హాఫ్ సెంచరీ: లార్డ్స్ టెస్టులో ఎరాస్ముస్‌ అరుదైన ఘనత

By Nageshwara Rao
 Erasmus completes half-century of Tests

లండన్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టులో ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన అంఫైర్ మరైస్‌ ఎరాస్ముస్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లార్డ్స్‌ టెస్టు అతనికి కెరీర్‌లో అంపైర్‌గా 50వ టెస్ట్‌.

తద్వారా ఈ ఘనత సాధించిన 17వ అంఫైర్‌గా, దక్షిణాఫ్రికాకు చెందిన రెండో అంఫైర్‌గా నిలిచాడు. ఎరాస్ముస్‌ కంటే ముందు దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్ట్‌జెన్‌ ఈ ఘనతను సాధించాడు. రూడీ కోర్ట్‌జెన్‌ 108 టెస్టులకు అంపైర్‌గా వ్యవహరించాడు. ఈ జాబితాలో స్టీవ్‌బక్‌నర్‌ 128 టెస్టులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

54 ఏళ్ల ఎరాస్ముస్ 2010లో బంగ్లాదేశ్‌-భారత్‌ జట్ల మధ్య చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో తొలిసారి అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. 2016, 2017లో ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా డేవిడ్‌ షపర్డ్ ట్రోఫీని అందుకున్నాడు. అంపైర్‌ కాకముందు ఎరాస్ముస్‌ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు.

1
42375

మొత్తం 53 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లాడి 1913 పరుగులతో 131 వికెట్లు పడగొట్టాడు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ఎరాస్ముస్‌ను అభినందిస్తూ అతని సేవలను కొనియాడింది. ఈ సందర్భంగా అతడికి ఓ మమెంటోని కూడా బహుకరించింది.

ఈ సందర్భంగా ఎరాస్ముస్‌ మాట్లాడుతూ "తన జీవితంలో మరిచిపోలేని రోజని, ఈ ఘనతను అందుకున్న17వ అంపైర్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది" అని ఆనందం వ్యక్తం చేశాడు. తన విజయానికి తన కుంటు సభ్యులే కారణమని, తనకు మద్దతుగా నిలిచిన ఐసీసీ, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు.

50కిపైగా టెస్టుల్లో అంఫైర్‌గా విధులు నిర్వహించిన వారు:
* Steve Bucknor - 128 Tests (1989-2000)
* Aleem Dar - 120 Tests (2003-2018)
* Rudi Koertzen - 108 Tests (1992-2010)
* Daryl Harper - 95 Tests (1998-2011)
* David Shepherd - 92 Tests (1985-2005)
* Billy Bowden - 84 Tests (2000-2015)
* Darrell Hair - 78 Tests (1992-2008)
* Simon Taufel - 74 Tests (2000-2012)
* S. Venkatraghavan - 73 Tests (1993-2004)
* Ian Gould - 67 Tests (2008-2018)
* Dickie Bird - 66 Tests (1973-1996)
* Rod Tucker - 63 Tests (2010-2018)
* Steve Davis - 57 Tests (1997-2015)
* Kumar Dharmasena - 53 Tests (2010-2018)
* Richard Kettleborough - 53 Tests (2010-2018)
* Nigel Llong - 53 Tests (2008-2018)

Story first published: Friday, August 10, 2018, 17:39 [IST]
Other articles published on Aug 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+