ఎపిక్ రెస్పాన్స్!: కేఎల్ రాహుల్ హిందీపై ఓ మహిళా ఫ్యాన్ ఇలా
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో పూణెలో జరిగిన తొలి టెస్టులో విఫలమైన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు.
ఈ ఏడాది తాను ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కూడా కేఎల్ రాహుల్ 2,10, 64, 10 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ చెత్త ప్రదర్శనపై సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మంగళవారం తనను విమర్శించిన ఓ అభిమానికి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ సమాధానికి మరొక అభిమాని ముగ్ధురాలైంది. అంతేకాదు రాహుల్‌కు ఊహించని రిప్లై ఇచ్చింది.
అసలేం జరిగింది?
టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ మంగళవారం కేఎల్ రాహుల్‌ని ట్విట్టర్ ఫాలో అయ్యాడు. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంలో ఓ తుంటరి అభిమాని కేఎల్ రాహుల్‌ని 'పరుగులు ఎలా చేయాలో అది అలోచించు' అని సూచించాడు.
ఇందుకు గాను రాహుల్ తనదైన శైలిలో ఆ తుంటరి అభిమానికి హిందీలో సమాధానమిచ్చాడు. అయితే రాహుల్ ఇచ్చిన సమాధామనే ఇప్పుడు అందరినీ నవ్వేలా చేస్తోంది.
ట్విట్టర్‌లో రాహుల్‌ని ఫాలో అయిన అశ్విన్
తనను ట్విట్టర్‌లో అశ్విన్ ఫాలో అవడంతో కేఎల్ రాహుల్ ఎంతగానో సంబరపడ్డాడు.
రాహుల్ సంతోషం
రాహుల్ సంతోషంలో 'ఈరోజు ఎంత మంచి రోజు. ఓ లెజెండ్ నన్ను ఫాలో అవుతున్నాడు' అని సంతోషించాడు. అయితే ఇందుకు ఓ తుంటరి అభిమాని ఇలా స్పందించాడు.
అభిమానికి ప్రశ్నకు రాహుల్ సమాధానం
తుంటరి అభిమానికి ప్రశ్నకు రాహుల్ ఇలా సమాధానమిచ్చాడు. 'పరుగులు ఎలా సాధించాలో వచ్చి బోధించు. మాకు తెలుసు పరుగులు ఎలా సాధించాలో' అని అన్నాడు.
రాహుల్ హిందీపై ఓ అభిమాని
రాహుల్ హిందీపై ఓ అభిమాని ఇలా 'నువ్వు హిందీలో ఇదంతా టైప్ చేశావా. దీనిని నేను నమ్మలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది.
రాహుల్ హిందీపై అభిమానులు
రాహుల్ హిందీపై ఓ టీమిండియా అభిమాని ఇలా 'గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. నువ్వు సెంచరీ చేశావా లేదా అనేది మాకు ముఖ్యం కాదు. నేను నీకు ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తాను. నేను టీమిండియాకు సపోర్టుగా ఉంటాను' అని కామెంట్ పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications