Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో వన్డేలో భారత్ విజయం: 2-0తో సిరిస్ కైవసం

హైదరాబాద్:రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కోహ్లీ సేన 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ధోనీ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీకి ఇదే తొలి వన్డే సిరిస్ విజయం.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 381 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో భాగంగా ఇంగ్లాండ్‌ 8 వికెట్లు కోల్పోయి 366 పరుగులు చేసింది.ఇయాన్ మోర్గాన్ 102 పరుగులు, జాసన్ రాయ్ 82, రూట్ 54, మొయిన్ అలీ 55 పరుగులతో రాణించినా ఇంగ్లాండ్‌ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రన్ రేట్‌ను కాపాడుకుండూ బ్యాటింగ్ కొనసాగిచింది.

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. 81 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. 48 ఓవర్ మూడో బంతికి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మోర్గాన్ పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు.

మోర్గాన్‌ ఔట్ తర్వాత మిగిలిన వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 366 పరుగులతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు, భువనేశ్వర్ కుమార్, జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు.

యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

రెండో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 2011లో చివ‌రిసారిగా వరల్డ్ కప్‌లో సెంచ‌రీ సాధించిన యువరాజ్ మ‌ళ్లీ ఆరేళ్ల త‌ర్వాత సెంచరీని సాధించడం విశేషం. ఇక ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు.

ఇంగ్లాండ్‌ కెప్టెన్ మోర్గాన్‌ అరుదైన రికార్డు

కటక్‌లో జరుగుతున్న వన్డేతో ఇంగ్లాండ్‌ ఆటగాడు మోర్గాన్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో మోర్గాన్‌ ఇంగ్లాండ్‌ తరపున 50 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అరుదైన ఘనతను సాధించాడు. 50 మ్యాచులకు పైగాఇంగ్లాండ్‌ తరపున సారథిగా వ్యవహరించిన ఆరో ఆటగాడు మోర్గాన్‌ కావడం విశేషం.

బుమ్రాకే తొలి వికెట్: ఇంగ్లాండ్ 66/1

382 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్‌లో ఇంగ్లాండ్‌కు జస్ ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. షాట్లతో అలరించే ప్రయత్నం చేస్తున్న హేల్స్‌ను అవుట్ చేశాడు. బుమ్రా వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ ను కట్ చేసేందుకు ప్రయత్నించిన హేల్స్ (14) ధోనీ చేతికి చిక్కి పెవిలియన్ కు చేరాడు. దీంతో కేవలం 28 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ లక్ష్యం 382

కటక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. లోకేష్ రాహుల్(5), ధావన్(11), కోహ్లీ(8) తొందరగానే ఔటైనప్పటికీ యువీ, ధోనీలు నిలకడగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌కు 382 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ వన్డేలో యువరాజ్ 150 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరగా ధోనీ 134 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4 వికెట్లు, ప్లంకెట్ 2 వికెట్లు తీసుకున్నారు.

యువరాజ్ 150 ఔట్

రెండో వన్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోరు 281 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 126 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండో వన్డేలో యువీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడిన యువీ అంతే వేగంగా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

ధోని సెంచరీ
కటక్ వేదిగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సెంచరీ సాధించాడు. 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ చేసిన తొలి సెంచరీ ఇదే. తన వన్డే కెరీర్‌లో 10వ సెంచరీ నమోదు చేశాడు.

Ms Dhoni

యువరాజ్ సింగ్ సెంచరీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్ సెంచరీ చేశాడు. కేవలం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులో దిగిన యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డేల్లో యువరాజ్‌కి ఇది 14వ సెంచరీ.

ధోని అర్ధసెంచరీ
రెండో వన్డేలో ధోని అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో మునిగిన జట్టును యువరాజ్ సింగ్, ధోనీలు ఆదుకున్నారు. ఇద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును ధాటిగా పెంచారు. యువీకి పూర్తి సహకారం అందిస్తూ ధోనీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 53 పరుగులు చేశాడు. 29.4 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

యువరాజ్ అర్ధసెంచరీ

కటక్‌ వేదికగా బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. ధావన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ధోనీతో కలిసి నిలకడగా ఆడుతూ యువరాజ్ సింగ్ 56 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 20.3 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.

కోహ్లీ అవుట్: నిరాశ చెందిన అభిమానులు
రెండో వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లోకేష్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. తొలి వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన కోహ్లీ.. ఈ మ్యాచ్ లో ఎనిమిది పరుగులకే అవుటయ్యే సరికి అభిమానులు నిరాశ చెందారు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. వోక్స్ ఒకే ఓవర్లో ఓపెనర్ లోకేష్‌ రాహుల్‌, కెప్టెన్ విరాట్‌ కోహ్లీలను పెవిలియన్‌కు చేర్చాడు. వోక్స్ తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్‌ శిఖర్ ధావన్‌‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 15 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

Virat Kohli

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో వన్డేలో టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ శుభారంభానిచ్చారు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వోక్స్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ స్టోక్స్‌కు స్లిప్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన లోకేష్ 5 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. రెండు ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోవడంతో టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు.

గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

తొలి వన్డేలో విజయం సాధించి జోరుమీద ఉన్న భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్ గెలుపుకోసం ఉరకలేస్తుంది. కటక్ వేదికగా భారత్-ఇంగ్లాడ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. టాస్ కటక్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది.

జట్లు:

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ధోనీ, రాహుల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే, యువరాజ్ సింగ్, అజింక్య రహానె, హార్ధిక్ పాండ్య, కేదార్ జాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఉమేష్ యాదవ్.

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మెయిన్ ఆలీ, బెయిర్ స్టో, జేక్ బాల్, శ్యామ్ బిలింగ్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), డాసన్, అలెక్స్ హాలెస్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ ఎం, క్రిస్ వోక్స్.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+