ఇవాన్ మోర్గాన్ Vs రషీద్ ఖాన్: ఊచకోత అనే పదం కూడా తక్కువే!

మాంఛెస్టర్: రషీద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్ టాప్ క్లాప్ లెగ్ స్పిన్నర్. ఆ దేశ జాతీయ జట్టు బౌలింగ్ తురుపుముక్క. తనదైన శైలిలో బౌలింగ్ వేస్తూ, అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ కాలంలో తారాజువ్వలా దూసుకొచ్చిన యంగ్ క్రికెటర్. ఆఫ్ఘనిస్తాన్ జట్టు కంటే హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలర్‌గానే ఆయనకు మనదేశంలో గుర్తింపు ఎక్కువ. పిసినారి. పొదుపుగా బౌలింగ్ చేయడంలో అతణ్ని మించిన ఘనుడు లేడనే అంటుంటారు క్రికెట్ పండితులు. అలాంటి రషీద్ ఖాన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్. చీల్చి చెండాడటం అనేది చాలా చిన్నపదంగా చెప్పుకోవచ్చు. ఊచకోత కోశారు. బంతి ఎక్కడ వేసినా, ఎలా వేసినా.. ఫెన్సింగ్ దాటించేశారు ఇంగ్లండ్ క్రికెటర్లు. ప్రత్యేకించి- కేప్టెన్ ఇవాన్ మోర్గాన్. తన ధ్యాసంతా రషీద్ మీదే పెట్టాడా? అనేలా చెలరేగిపోయాడు.

పిచ్‌పై బంతి.. ఆ తరువాత ఫెన్సింగ్ అవతలే
ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటూ మోర్గాన్‌ను పెవిలియన్ దారి పట్టించడం అంటే తల ప్రాణాలు తోకలోకొస్తుంది బౌలర్లకు. అతను క్రీజులో పాతుకుపోయాడంటే ఎంతలా రెచ్చిపోయి ఆడతాడో అనడానికి ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడిన ఇన్నింగ్ ఓ ట్రైలర్‌లా భావించుకోవచ్చు. బౌలర్ ఎలాంటి వాడైనా పట్టించుకోలేదు. అతని చేతి నుంచి వెలువడిన బంతి పిచ్ మీద పడటం ఆలస్యం అంతే! దాన్ని బౌండరీ దాటించడమో, ప్రేక్షకుల తలల మీదుగా భారీ షాట్ ఆడటమో చేశాడు మోర్గాన్

20 బంతుల్లో 58
ఇన్నింగ్ మొత్తం మీద ఇవాన్ మోర్గాన్ 71 బంతులను ఎదుర్కొని 147 పరుగులు చేశాడు. ఇందులో రషీద్ ఖాన్ వేసిన బంతులు 20 మాత్రమే. ఈ 20 బంతుల్లో కూడా ఆరు డాట్ బాల్స్‌గా వెళ్లాయి. ఈ ఆరు పోగా.. మిగిలిన 14 బంతుల్లోనే ఏకంగా 58 పరుగులను పిండుకున్నాడు ఈ ఇంగ్లండ్ టీమ్ కేప్టెన్. ఈ 14 బంతుల్లో ఏడింటిని సిక్సర్లుగా మలిచాడు. ఓ బౌండరీ సాధించాడు. ఇవాన్ మోర్గాన్ వన్‌సైడ్ వార్‌ను తట్టుకోలేకపోయాడు రషీద్ ఖాన్. బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా చెప్పుకొనే రషీద్ ఖాన్.. చివరికి తన పది ఓవర్ల కోటాను పూర్తి చేయడానికి వణికిపోయాడు. తొమ్మిది ఓవర్లతోనే సరిపెట్టుకున్నాడంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

35 ఓవర్లలో 199..50 ఓవర్లకు 397
35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ టీమ్.. ఆ తరువాత మిగిలిన 15 ఓవర్లలోనే 196 పరుగులను సాధించడం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ల దూకుడును స్పష్టం చేస్తోంది. 50 ఓవర్ల కోటా పూర్తయ్యేసరికి 397 పరుగులను సాధించింది. స్కోరు బోర్డుపై అంకెలు అలా, అలా మారుతూ వెళ్లిపోయాయంతే! 397 వద్ద ఆగిపోయాయి. ఓ దశలో 400 మార్క్‌ను దాటేలా కనిపించినప్పటికీ.. వీలు కాలేదు. ఈ మధ్యలో మరో నాలుగు వికెట్లు కోల్పోవడం వల్ల ఇన్నింగ్ కాస్త నెమ్మదించింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టు ఏ దశలో కూడా దూకుడుగా ఆడలేదు. 50 ఓవర్లను పూర్తిగా ఆడాలనే ఉద్దేశమే ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్లలో కనిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications