RCB vs KKR: 'టీ20 క్రికెట్‌లో అసలైన ఆటగాడు అతడే.. ప్లే ఆఫ్స్‌కి చేరతామని కూడా అసలు అనుకోలేదు'

షార్జా: ఐపీఎల్ 2021లో భాగంగా షార్జాలో సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా సునీల్ నరైన్‌ (4/21) అద్భుత బౌలింగ్‌ కారణంగా మొదట బెంగళూరు 7 వికెట్లకు 138 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (39; 33 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. శుభ్‌మన్‌ గిల్‌ (29; 18 బంతుల్లో 4×4), వెంకటేశ్‌ అయ్యర్‌ (26; 30 బంతుల్లో 1×6), సునీల్‌ నరైన్‌ (26; 15 బంతుల్లో 3×6) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా మరో రెండు బంతులు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొహ్మద్ సిరాజ్‌ (2/19), హర్షల్‌ పటేల్‌ (2/19), యుజ్వేంద్ర చహల్‌ (2/16) రాణించినా కోల్‌కతా విజయాన్ని ఆపలేకపోయారు. ఈ విజయంతో కోల్‌కతా టైటిల్ దిశగా మరో అడుగు వేసింది.

Amy Hunter: మిథాలీ రికార్డు బద్దలు కొట్టిన ఐర్లండ్‌ బ్యాటర్‌ అమీ!!Amy Hunter: మిథాలీ రికార్డు బద్దలు కొట్టిన ఐర్లండ్‌ బ్యాటర్‌ అమీ!!

నరైన్‌ అసలైన ఆటగాడు:

నరైన్‌ అసలైన ఆటగాడు:

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న సునీల్‌ నరైన్‌పై కేకేఆర్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 క్రికెట్‌లో నరైన్‌ అసలైన ఆటగాడని, అతడిని కలిగి ఉండటం తమకు ఎంతో ఉపయోగపడుతోందన్నాడు. 'సునీల్‌ నరైన్‌ మా విజయాన్ని తేలిక చేశాడు. షార్జాలో మెరుగవుతున్న వికెట్‌పై అతను అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. మేము మొదటి ఆరు ఓవర్ల తర్వాత వికెట్లు తీయడం కొనసాగించాము. ఛేదనలో కూడా బాగా ఆడాం. వికెట్ ప్రవర్తించే తీరును బట్టి బ్యాటింగ్ చేసాం. మంచి ఆరంభం దక్కింది. మేము ఆడిన క్రికెట్ మరియు చూపించిన నిలకడ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీ20 క్రికెట్‌లో నరైన్‌ అసలైన ఆటగాడు. అలాంటి ప్లేయర్ మా జట్టులో ఉండడం మా అదృష్టం' అని మోర్గాన్‌ అన్నాడు.

ప్రతి వికెట్‌ను ఆస్వాదించా:

ప్రతి వికెట్‌ను ఆస్వాదించా:

షార్జా పిచ్‌పై వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ మాయ చేసిన విషయం తెలిసిందే. తొలుత బంతితో నాలుగు కీలక వికెట్లు తీయగా.. తర్వాత బ్యాటింగ్‌లో (26; 15 బంతుల్లో 3x6) విలువైన పరుగులు చేశాడు. దాంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కేఎస్ భరత్ వికెట్లను అతడు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం నరైన్‌ మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఇలా మ్యాచ్‌ను గెలిపించే ప్రదర్శన చేస్తే బాగుంటుందన్నాడు. ఈరోజు అత్యుత్తమ ప్రదర్శన చేసినట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తాను తీసిన ప్రతి వికెట్‌ను ఆస్వాదించానని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ తెలిపాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు.

ప్లే ఆఫ్స్‌కి చేరతామని అనుకోలేదు:

ప్లే ఆఫ్స్‌కి చేరతామని అనుకోలేదు:

కోల్‌కతా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ మాట్లాడుతూ... 'ఇది మాకు భారీ విజయం. చాలా సంతోషంగా ఉంది. మేం యూఏఈ లెగ్‌లోకి వచ్చేముందు ప్లే ఆఫ్స్‌కి చేరతామని కూడా అస్సలు అనుకోలేదు. కానీ జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడటంతో ఇక్కడి దాకా వచ్చాం. ఇకపైనా ఇలాంటి ప్రదర్శనే చేస్తామని ఆశిస్తున్నా. నేను తొలి దశలో భారత్‌లో ఆడినప్పుడు సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయా. ఒక్కసారి కుదురుకుంటే సరిపోతుందని అనుకున్నా. అదే నిజమైంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు శుభారంభం చేసినా తర్వాత మా స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్ నరైన్‌ కట్టుదిట్టంగా బంతులేసి మమ్మల్ని పోటీలోకి తెచ్చారు. వారిద్దరి బౌలింగ్ అద్భుతం. ముఖ్యంగా నరైన్ బెంగళూరుపై ఆధిపత్యం చెలాయించి కీలక వికెట్లు తీయడమే మాకు కలిసి వచ్చింది' అని చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, October 12, 2021, 11:36 [IST]
Other articles published on Oct 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X