Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eoin Morgan: ఇంగ్లాండ్‌కు మంచి బౌలర్ దొరికాడు.. వన్డే ప్రపంచకప్‌కు అతన్ని రెడీ చేయండి

 Eoin Morgan Praises Richard Gleeson and suggests that Ready him for ODI Worldcup

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్ రిచర్డ్ గ్లీసన్‌కు భారత్‌పై అద్భుతమైన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం దక్కింది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ తన 4ఓవర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి మూడు బిగ్ వికెట్లను తీశాడు. అలాగే చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4ఓవర్లలో కేవలం 15పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రెండో టీ20లో గ్లీసన్ బౌలింగ్ ప్రదర్శనను మోర్గన్ ప్రశంసించాడు. గ్లీసన్‌కు మంచి ఫ్యూచర్ ఉందని.. 2023లో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ జట్టు అతన్ని సిద్ధం చేయాలని సూచించాడు.
'గ్లీసన్ అరంగేట్రం గొప్పగా జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్‌కు మరో పేసర్ దొరికాడు. కౌంటీల్లో బాగా రాణించి ఇంగ్లాండ్‌కు ఎంపికైన గ్లీసన్.. తొలి మ్యాచ్‌లోనే కోహ్లి, పంత్, రోహిత్ శర్మలను అవుట్ చేశాడు. ఇది అసాధారణమైన ప్రదర్శన. ఇంగ్లిష్ క్రికెట్‌కు అతనో గొప్ప అన్వేషణ అనే చెప్పాలి. వచ్చే ఏడాది భారతదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ కోసం అతన్ని జట్టు మేనేజ్‌మెంట్ సిద్ధం చేయాలి' అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.
బంతితో గ్లీసన్ రాణించినప్పటికీ.. టీమిండియా ఈ మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకుంది. తొలుత నిర్ణీత 20ఓవర్లలో 170పరుగులు చేసిన ఇండియా.. 171పరుగుల లక్ష్యాన్ని ఈజీగా కాపాడుకోగలిగింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో స్వింగ్ ద్వారా విధ్వంసం సృష్టించాడు. అతను ఓపెనర్లు జాసన్ రాయ్, కెప్టెన్ జోస్ బట్లర్ ఇద్దరి వికెట్లను పడగొట్టి ఇండియాకు మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇక తదనంతరం ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 49పరుగుల తేడాతో ఓటమి పాలయింది. నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.

Story first published: Sunday, July 10, 2022, 18:16 [IST]
Other articles published on Jul 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+