మోర్గాన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్: సరికొత్త రికార్డు సృష్టించాడు
హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో ఇంగ్లాండ్ బోణీ చేసింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టుపై ఇంగ్లాండ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన వెస్టిండిస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 116 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో అద్భుత సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ఇయాన్ మోర్గాన్ సరికొత్త రికార్డుని సృష్టించాడు.
ఇంగ్లాండ్ తరపున వన్డే కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డుని తన పేరిట లిఖించాడు. కెప్టెన్‌గా మోర్గాన్‌కు ఇది ఐదో సెంచరీ. తద్వారా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు ఆండ్రూ స్ట్టాస్, అలెస్టర్ కుక్‌ల రికార్డును ఇయాన్ మోర్గాన్ అధిగమించాడు. అంతకుముందు స్ట్రాస్, కుక్‌లు కెప్టెన్లుగా నాలుగు సెంచరీలు మాత్రమే సాధించారు.
The last time they played each other in ODIs:https://t.co/Yj8O3narHM pic.twitter.com/ZPxjW9l5l0 — ECB🏏 (@ECB_cricket) March 3, 2017 '>
వెస్టిండిస్ విజయ లక్ష్యం 297
మరోవైపు బిల్లింగ్స్(52), స్టోక్స్(55) రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. వెస్టిండిస్ బౌలర్లలో నర్సే, గాబ్రియేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 297 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఆరంభంలోనే తడబడింది.
వెంట వెంటనే అవుటైన ఓపెనర్లు
ఓపెనర్లు బ్రాత్‌వైట్, లివీస్ వెంట వెంటనే ఔటవ్వడంతో తర్వాత వచ్చిన వారు ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో జాసన్ మహ్మద్ 72, కార్టర్ 52 పరుగులతో రాణించారు.

251 పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్
ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 47.2 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 45పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు వోక్స్, ప్లంకెట్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.

మెర్గాన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
సెంచరీ చేసిన ఇయాన్ మెర్గాన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 5న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications