For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ నిర్ణయమే ఇంగ్లాండ్ కొంపముంచింది: అంఫైర్‌పై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు

రెండో టీ20లో ఇంగ్లాండ్ ఓటమికి అంపైరింగే కారణమని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: రెండో టీ20లో ఇంగ్లాండ్ ఓటమికి అంపైరింగే కారణమని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో జో రూట్‌ను ఎల్బీడబ్యూగా ప్రకటించిన అంపైర్ షంషుద్దీన్‌పై మోర్గాన్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయనున్నాడు. ముఖ్యంగా జో రూట్ అవుట్‌పై ఇయాన్ మెర్గాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైరింగ్ నాణ్యతకు సంబంధించిన ఫీడ్ బ్యాక్‌తో రిఫరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.

జో రూట్ వివాదాస్పదంగా అవుట్

జో రూట్ వివాదాస్పదంగా అవుట్

'తదుపరి గేమ్‌కు ముందే అంఫైరింగ్‌పై ఫిర్యాదు చేసే అవకాశం లభించింది. క్లిష్ట సమయంలో జో రూట్ వివాదాస్పదంగా అవుట్ కావడం మా ఓటమికి కారణమైంది. దీనిపై రిఫరీకి ఫిర్యాదు చేయనున్నాం. ట్వంటీ 20ల్లో డీఆర్ఎస్ ఎందుకు లేదో అర్థం కావడం లేదు' అని మోర్గాన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

20వ ఓవర్‌లో విజయం నుంచి దూరంగా

20వ ఓవర్‌లో విజయం నుంచి దూరంగా

'చాలా నిరాశపరిచింది. జో రూట్ వికెట్ కోల్పోవడంతో 20వ ఓవర్‌లో విజయం నుంచి దూరంగా వెళ్లింది. తమ ఇన్నింగ్స్ 20 ఓవర్‌లో జో రూట్ అవుట్ కావడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఒకవేళ జో రూట్ అవుట్‌ను తాము సవాల్ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా మ్యాచ్‌ను గెలిచేవాళ్లం' అని మోర్గాన్ ధీమా వ్యక్తం చేశాడు.

జోరూట్‌ను తన తొలి బంతికే ఎల్‌బీడబ్ల్యూగా

జోరూట్‌ను తన తొలి బంతికే ఎల్‌బీడబ్ల్యూగా

చివరి ఓవర్‌ వేసిన టీమిండియా పేసర్ బుమ్రా.. జోరూట్‌ను తన తొలి బంతికే ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఆ బంతి జో రూట్ బ్యాట్‌కు తగిలిన తర్వాతే అతని ప్యాడ్లకు తాకినట్లు రీప్లేలో స్పష్టమైంది. కొన్ని సందర్బాల్లో ఇలా జరగడం సాధారణమే అయినా, అదే తాము మ్యాచ్‌ను కోల్పోవడానికి కారణమైందని ఇంగ్లాండ్ అంటోంది.

జస్‌ప్రీత్ బుమ్రాను నమ్మిన కెప్టెన్ కోహ్లీ

జస్‌ప్రీత్ బుమ్రాను నమ్మిన కెప్టెన్ కోహ్లీ

కాగా, చివరి ఓవర్‌లో విజయానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే బాధ్యతను జస్‌ప్రీత్ బుమ్రాకు భారత కెప్టెన్ కోహ్లీ అప్పచెప్పాడు. చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిలోనే జో రూట్‌ను అవుట్ చేశాడు. రెండో బంతికి మోయిన్ అలీ సింగిల్ తీయగా, మూడో బంతిలో ఒక్క పరుగు కూడా రాలేదు.

నాలుగో బంతిలో జొస్ బట్లర్ క్లీన్ బౌల్డ్

నాలుగో బంతిలో జొస్ బట్లర్ క్లీన్ బౌల్డ్

నాలుగో బంతిలో జొస్ బట్లర్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతిలో ఒక పరుగు లెగ్‌బై రూపంలో ఇంగ్లాండ్‌కు లభించింది. దీనితో చివరి బంతిలో ఇంగ్లాండ్ గెలవడానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. కానీ, ఆ బంతికి మోయిన్ అలీ బీట్ కావడంతో ఒక్క పరుగు కూడా లభించలేదు. భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌల్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+