Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అజింక్య రహానేని తీసినట్లే.. దినేశ్‌ కార్తిక్‌ను తీసేయొచ్చు: గవాస్కర్

Eoin Morgan can replace Dinesh Karthik as Kolkata Knight Riders Captain Says Sunil Gavaskar

దుబాయ్: ‌ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ప్రారంభంలో సరిగా ఆడకపోతే ఆ జట్టు కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌ను తొలగించినా ఆశ్చర్యపోనవసరం లేదని మాజీ భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో కోల్‌కతా మొదట్లో సరిగా ఆడకపోతే కార్తిక్‌ను తొలగించి గతేడాది ఇంగ్లడ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన ఇయాన్‌ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు అందించే అవకాశం ఉందన్నారు. గతేడాది రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాంచైజీ అజింక్య రహానేను తీసేసి.. స్టీవ్ ‌స్మిత్‌కు జట్టు పగ్గాలు అందించిన విషయాన్ని లిటిల్ మాస్టర్ గుర్తుచేశారు.

మోర్గాన్‌ చేరికతో

మోర్గాన్‌ చేరికతో

తాజాగా సునీల్ గవాస్కర్ క్రీడాఛానల్ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ... 'కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటినుంచి ఎంతో బలంగా ఉంది. ఇపుడు ఇయాన్ మోర్గాన్‌, పాట్ ‌కమిన్స్‌ చేరడంతో మరింత బలంగా మారింది. కేకేఆర్ జట్టుకు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఇక మోర్గాన్‌ చేరికతో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ మరింత పటిష్టంగా మారింది. అతడి అనుభవం జట్టుకు ఉపయోగకరం. ఇక ఆండ్రూ రసెల్‌ రూపంలో ఆ జట్టుకు అతిపెద్ద టీ20 ప్లేయర్‌ ఉన్నాడు. అతడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగలడు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు' అని తెలిపారు.

 డీకేను తీసేయొచ్చు

డీకేను తీసేయొచ్చు

'దినేశ్‌ కార్తిక్‌ కెప్టెన్సీలో ఈ సీజన్‌ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ సరిగా రాణించకపోతే.. తర్వాత అతడిని తొలగించి ఇయాన్ మోర్గాన్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. గతేడాది రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు అజింక్య రహానేను తీసేసి.. స్టీవ్‌ స్మిత్‌కు జట్టు పగ్గాలు అందించింది. ఇపుడూ అలానే జరగొచ్చు. మోర్గాన్‌కు కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. జట్టును విజయపథంలో నడిపించే అనుభవం కూడా అతని సొంతం. గతేడాది ఇంగ్లడ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించాడు' అని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్‌ పేర్కొన్నారు.

ఇంగ్లండ్‌ సిరీస్‌లో తేలిపోయిన కమిన్స్

ఇంగ్లండ్‌ సిరీస్‌లో తేలిపోయిన కమిన్స్

'ఈసారి వేలంలో కోల్‌కతా అత్యధిక ధర వెచ్చించి మరీ బౌలర్ పాట్‌ కమిన్స్‌ను తీసుకుంది. అతడు టాప్ క్లాస్ బౌలర్. అయితే ఇటీవల జరిగిన ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా సిరీస్‌లో తేలిపోయాడు. వికెట్ల వేట కొనసాగించలేదు. కమిన్స్‌పై ఒత్తిడి నెలకొంటుందని నా అభిప్రాయం. మరి పుంజుకుంటాడో చూడాలి' అని లిటిల్ మాస్టర్ అన్నారు. గవాస్కర్ భారత్ తరఫున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. సన్నీ టెస్టుల్లో ఆకట్టుకున్నా.. వన్డేల్లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయారు.

2018లో కేకేఆర్ పగ్గాలు

2018లో కేకేఆర్ పగ్గాలు

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ తర్వాత 2018లో కేకేఆర్ జట్టు పగ్గాలు అందుకున్న దినేశ్‌ కార్తిక్.. ఆ సీజన్‌లో ఫర్వాలేదనిపించాడు. జట్టును నాలుగో స్థానంలో నిలబెట్టాడు. కానీ గతేడాది కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా తీసుకెళ్లలేదు. దీంతో అతనిపై విమర్శలు ఎదురయ్యాయి. .కెప్టెన్‌గా డీకేను తొలగిస్తారని వార్తలు వెలుబడ్డాయి. అయితే యాజమాన్యం మాత్రం అతనిపై నమ్మకముంచింది. ఈ నేపథ్యంలో దినేశ్‌ కార్తిక్‌పై ఈసారి కాస్తంత ఒత్తిడి ఉండనుంది. బుధవారం ముంబైతో తొలి మ్యాచ్‌లో కేకేఆర్ తలపడనుంది.

SRH vs RCB: మిస్‌ యూ 'వెంకీమామా': సన్‌రైజర్స్‌

Story first published: Monday, September 21, 2020, 16:10 [IST]
Other articles published on Sep 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+