ఎంఎస్ ధోనీ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన ఇయాన్ మోర్గాన్!!

సౌతాంప్టన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును తాజాగా మోర్గాన్ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డును మోర్గాన్ తన పేరుపై లికించుకున్నాడు. అత్యధిక సిక్సర్లు (212*) బాదిన కెప్టెన్‌గా ధోనీ (211)ని మోర్గాన్ అధిగమించాడు.

163 మ్యాచ్‌ల్లో 211 సిక్సర్లు:
ఇయాన్ మోర్గాన్ కేవలం 163 మ్యాచ్‌ల్లో 211 సిక్సర్లు బాదగా.. ఎంఎస్ ధోనీ 332 మ్యాచ్‌ల్లో 211 మార్క్ అందుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగి అరుదైన ఫీట్ చేరుకున్నాడు. ఆసీస్ క్రికెటర్ రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లలో 171 సిక్సర్లు), కివీస్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కలమ్ (121 మ్యాచ్‌లలో 170 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్ (124 మ్యాచ్‌ల్లో 135 సిక్సర్లు) అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో వరుసగా ఉన్నారు.

ఐర్లాండ్ సంచలనం:
మంగళవారం అర్థరాత్రి ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టుపై ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేందించింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (142; 128 బంతుల్లో 9x4, 6x6), కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ(113; 112 బంతుల్లో 12x4) శతకాలతో చెలరేగిపోవడంతో ఆ జట్టు విజయం సాధించింది. ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లీష్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరు కలిసి 200లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మోర్గాన్ సెంచరీ:
తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ఆది నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. అయితే ఇయాన్ మోర్గాన్ (106; 84 బంతుల్లో 15x4, 4x6), టామ్ బాంటన్ (58; 51 బంతుల్లో 6x4, 1x6), డేవిడ్ విల్లీ (51; 42 బంతుల్లో 3x4, 3x6) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 328 పరుగులు చేసి ఆలౌటైంది. క్రేగ్ యంగ్ 3, జాషువా లిటిల్ 2, కాంఫర్ 2 రెండు వికెట్లు తీశారు. అంతకుముందు జరిగిన తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ గెలుపొంది సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును స్టిర్లింగ్ అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును డేవిడ్ విల్లే దక్కించుకున్నాడు.
పిల్లలను ఎప్పుడు కంటారని అడగ్గా.. అనుష్క ఏం చెప్పిందో తెలుసా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications