వరల్డ్‌కప్: తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అరుదైన ఘనత

హైదరాబాద్: ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఆతిథ్య జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ వన్డే మోర్గాన్‌కి 200వ వన్డే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసందీంతో ఇంగ్లాండ్ జట్టు తరుపున 200వ వన్డే ఆడుతున్న తొలి క్రికెటర్‌గా ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. మోర్గాన్‌కి మొత్తంగా ఇది 223వ వన్డే. అయితే, మిగతా 23 వన్డేలను మోర్గాన్ ఐర్లాండ్ జట్టు తరుపున ఆడాడు. మోర్గాన్ తర్వాత జేమ్స్ ఆండర్సన్(194), అలెక్స్ స్టివార్ట్(170), ఇయాన్ బెల్(161) ఈ జాబితాలో ఉన్నారు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి ఇంగ్లాండ్‌ని మోర్గాన్ ముందుండి నడిపిస్తున్నాడు. జట్టులో తనదైన మార్కుని చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. 2017 నుంచి ఇప్పటివరకు మోర్గాన్ 1957 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
{headtohead_cricket_2_6}
ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2015 వరల్డ్‌కప్ తర్వాత నుంచి కూడా అ జట్టులో మేటి ఆటగాళ్లతో కళకళలాడుతోంది. 2016లో టీ20 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది.
ఆ తర్వాత 2017లో సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీపైనల్ వరకు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సైతం ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications