న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ 4పరుగులు బ్రాడ్‌మన్ చేసుంటే బాగుండేది

 Entirely My Fault Bradman Didn’t Average 100 in Test Cricket, Says Former Australian Star Neil Harvey

న్యూఢిల్లీ: క్రికెట్‌లో ఆయనొక ట్రేడ్ మార్క్. చిరస్థాయిలో నిలిచిపోయేలా అంతర్జాతీయ క్రికెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు డాన్ బ్రాడ్‌మన్. ఆయన ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో డాన్ బ్రాడ్‌మన్ ఒకరని ధీటుగా చెప్పొచ్చు. తిరుగులేని టెస్ట్ క్రికెటర్‌గా పేరొందిన బ్రాడ్‌మన్ 52 మ్యాచ్‌ల్లో 12 డబుల్ సెంచరీలు, 29 సెంచరీలు సాధించాడు. బ్రాడ్‌మన్ బ్యాటింగ్ సగటు 99.94గా ఉంది.

డకౌట్ అవడంతో 99.94 దగ్గర ఆగిపోవాల్సి

డకౌట్ అవడంతో 99.94 దగ్గర ఆగిపోవాల్సి

చివరి ఇన్నింగ్స్‌లో కనీసం 4 పరుగులు చేసి ఉంటే.. ఆయన బ్యాటింగ్ యావరేజ్ 100గా ఉండేది. కానీ లాస్ట్ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో 99.94 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. బ్రాడ్‌మన్ 100 యావరేజ్ సాధించకుండా టెస్టులకు వీడ్కోలు పలకడానికి తనే కారణమని ఆసీస్ మాజీ క్రికెటర్ నీల్ హార్వే బాధపడుతున్నాడు. ఏడు దశాబ్దాలుగా ఇదే బాధ ఆయన్ను కలచి వేస్తోందని పేర్కొన్నాడు.

 హార్వే ఫోర్ కొట్టడంతో ఆసీస్ గెలిచి

హార్వే ఫోర్ కొట్టడంతో ఆసీస్ గెలిచి

చివరి మ్యాచ్ కంటే ముందు జరిగిన హెడింగ్లీ టెస్టులో బ్రాడ్‌మన్ 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ సమయంలో హార్వే ఫోర్ కొట్టడంతో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. సిరీస్‌లో 3-0 ఆధిక్యం సంపాదించింది. తను ఆ విన్నింగ్ షాట్ కొట్టకపోయి ఉంటే.. బ్రాడ్‌మన్ 100 సగటును అందుకునే వాడని హార్వే నమ్ముతున్నాడు.

నాలుగు పరుగులను బ్రాడ్‌మన్ చేసుంటే..

నాలుగు పరుగులను బ్రాడ్‌మన్ చేసుంటే..

లీడ్స్‌లో విన్నింగ్ బౌండరీ కొట్టినందుకు చాలా గిల్టీగా ఫీలవుతున్నా. బ్రాడ్‌మన్ టెస్టుల్లో 100 సగటు సాధించకపోవడం పూర్తిగా నా తప్పిదమే. ఆ నాలుగు పరుగులను అతడే చేసి ఉంటే.. బాగుండేదని హార్వే తెలిపాడు. అక్టోబర్ 8న (సోమవారం) ఆయన 90వ ఏట అడుగుపెడుతున్నాడు. 79 టెస్టులు ఆడిన ఆయన 21 సెంచరీలు చేశాడు.

 బ్రాడ్‌మన్ డకౌట్ అవుతాడని హార్వే

బ్రాడ్‌మన్ డకౌట్ అవుతాడని హార్వే

అప్పట్లో ఎవరికీ గణాంకాల గురించి తెలీదు. బ్రాడ్‌మన్ నాలుగు పరుగులు చేస్తే వంద సగటుతో పరుగులు చేసిన బ్యాట్స్‌‌మెన్ అవుతాడనే విషయం ఆ రోజుల్లో తెలీదు. అంతే కాదు.. చివరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌మన్ డకౌట్ అవుతాడని హార్వే అస్సలు ఊహించి ఉండడు.

Story first published: Sunday, October 7, 2018, 17:08 [IST]
Other articles published on Oct 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X