
సెహ్వాగ్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం
'నాకు సెహ్వాగ్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. అతను బ్యాటింగ్ చేస్తుంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేవాన్ని. సెహ్వాగ్ బ్యాటింగ్ చూస్తూ ఎక్కువగా ఆనంద పడేవాన్ని'అని సచిన్ తెలిపాడు. సెహ్వాగ్ క్రీజులోకి వెళుతుంటే అతను ఏమి చేస్తాడనే దాని కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాడినని అన్నాడు. క్రీజులో సెహ్వాగ్ ప్రణాళిక ఏమిటో ఎప్పుడూ తనకు అర్థమయ్యేది కాదని సచిన్ పేర్కొన్నాడు.

బ్రియాన్ లారా 'స్పెషల్ ప్యాకేజి'
ఇక తనకు వెస్టిండిస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా 'స్పెషల్ ప్యాకేజి' అని కొనియాడారు. ఇక టెన్నిస్ స్టార్ 'రోజర్ ఫెదరర్'ను ఫేవరేట్ నాన్-క్రికెట్ హీరోగా అభివర్ణించాడు. పాకిస్థాన్ మాజీ షోయబ్ అక్తర్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ లే తాను ఎదుర్కొన్న ఫాస్టెస్ట్ బౌలర్లు అని సచిన్ పేర్కొన్నాడు.

హాన్సీ క్రోనే బౌలింగ్‌కు భయపడేవాడిని
ఇక దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోనే బౌలింగ్‌కు విపరీతంగా భయపడేవాడినని సచిన్ పేర్కొన్నాడు. తనను చాలాసార్లు క్రోనే ఔట్ చేసిన విషయాన్ని కూడా సచిన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. తాను క్రికెట్‌గా ఎదుగుతున్న సమయంలో బీసీసీఐ ఎంతో మద్దతుగా నిలిచిందని సచిన్ తెలిపాడు.

బీసీసీఐ తోడ్పాటు
ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి బీసీసీఐ ఎన్నో శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల ప్రయోజనాలను బీసీసీఐ ఎంతగానో కాపాడుతోందన్నారు. మేం ఎదిగేందుకు అద్భుత అవకాశాలను ఇచ్చిందన్నారు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు. ఇక స్కూల్ క్రికెట్‌పై తాను ఎంసీఏకు ఇచ్చిన సూచనల వల్ల 1800కు పైగా చిన్నారులు క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారన్నాడు.


Click it and Unblock the Notifications