ఓపెనర్‌గా రోహిత్, ధావన్‌లతో జత కట్టడంపై కేఎల్ రాహుల్

హైదరాబాద్: ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "లక్ష్యం పెద్దది కాకపోవడంతో మా ప్రణాళిక ప్రకారం ఎక్కువసేపు క్రీజులో ఉండి పరుగులు సాధించాం" అని అన్నాడు.

బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు
"మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ప్రత్యర్ధి జట్టును 170 పరుగుల లోపు కట్టడిచేశారు. ఈ మ్యాచ్ విజయం క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుంది. ఆటను అర్థం చేసుకుంటూ మంచి ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. పరుగులు సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

జట్టుకు విజయాన్ని అందించాలనే
"జట్టుకు విజయాన్ని అందించాలనే మేం బరిలోకి దిగుతాం. దీనిని రోహిత్‌శర్మ సులువుగా చేస్తాడు. టెస్టు కెరీర్ ఆరంభంలో శిఖర్ ధావన్‌తో కలిసి బ్యాటింగ్ చేశాను. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంటుంది. హిట్‌మ్యాన్, గబ్బర్‌తో కలిసి ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా" అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

143 విజయ లక్ష్యంతో బరిలోకి టీమిండియా
కాగా, శ్రీలంక నిర్దేశించిన 143 విజయ లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పూణె వేదికగా జరగనుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

తొలి వికెట్‌కు 71 పరుగులు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 పోర్లు), శిఖర్ ధావన్(32; 29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం చేసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైనా శ్రేయస్ అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), కెప్టెన్ కోహ్లీ(30; 17 బంతుల్లో ఫోర్, 2 సిక్సులు)తో టీమిండియాకు విజయాన్ని అందించారు.

శుక్రవారం పూణె వేదికగా మూడో టీ20
భారత్ విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి కెప్టెన్ కోహ్లీ మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. కోహ్లి( 30 నాటౌట్; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) సిక్స్ కొట్టడంతో 17.3 ఓవర్‌లోనే టీమిండియా విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications