Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్‌ ఫొటో: కైఫ్‌తో కైఫ్‌.. చివరకు కత్రినాను కలుసుకున్నా!!

English Title: Ex Cricketer Mohammad Kaif Meets Bollywood Actress Katrina Kaif, Sends Twitter Into Frenzy

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌, బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ ఇద్దరూ వేరువేరు రంగాలకు చెందిన వారు. మహమ్మద్‌ కైఫ్‌ క్రికెట్‌లో ఫేమస్ అయితే.. కత్రినా కైఫ్‌ సినిమాల్లో ఫేమస్. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరు కలుసుకోలేదు. అయితే వారి పేర్లు ఒకేరకంగా ఉండడంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహమ్మద్‌ను సమయం దోరికినప్పుడల్లా ఆటపట్టిస్తూ ఉంటారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే చాలా కాలం తర్వాత మహమ్మద్‌ కైఫ్‌, కత్రినా కైఫ్‌లు కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఫొటోలకు ఫోజిలిచ్చారు. ఓ ఫొటోను మహమ్మద్‌ కైఫ్‌ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'చివరకు కత్రినాను కలుసుకున్నాను. గతంలో చెప్పాను. మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. కేవలం మానవత్వం తప్ప' అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కైఫ్‌ల అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. 'కైఫ్‌ స్వ్కేర్‌ను ఒకేసారి చూడాలన్న కల తీరింది' 'ఇద్దరి కెరీర్ లండన్ నుండే ఊపందుకుంది', 'మీ ఫీల్డింగ్ మిస్ అవుతున్నాం కైఫ్ భాయ్', 'అతన్ని కలిసినందుకు కత్రినా నువ్ అదృష్టవంతురాలివి' అని అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన మహమ్మద్‌ కైఫ్‌ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కు సహాయక కోచ్ గా ఉన్నాడు. మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్, సౌరవ్ గుంగూలీలతో కలిసి మహమ్మద్‌ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. వీరి ఆధ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-12లో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు కత్రినా కైఫ్‌.. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌తో కలిసి 'భారత్' సినిమాలో నటించింది. రంజాన్ పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాలో లక్కీగా సల్మాన్‌తో కలిసి నటించే అవకాశం కత్రినాకు దక్కింది. ప్రియాంక చోప్రా ఈ సినిమాను వదిలేయడంతో కత్రినా.. సల్మాన్‌తో జతకట్టింది.

Story first published: Wednesday, June 5, 2019, 16:07 [IST]
Other articles published on Jun 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+