Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్‌ కోసం: 21 దేశాలు దాటుకుని ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు... ఎవరీ మిల్లర్

హైదరాబాద్: ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్ తొలి టెస్టు గురువారం బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్ కోసం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య జరిగే ఈ సిరిస్ కోసం దేశ విదేశాల నుంచి ఎంతోమంది అభిమానులు నేరుగా స్టేడియంకు వచ్చారు.

యాషెస్ కోసం 21 దేశాలు

యాషెస్ కోసం 21 దేశాలు

అయితే ఓ యువకుడు మాత్రం 21 దేశాలు దాటి మ్యాచ్‌ను చూసేందుకు వచ్చాడు. అదేంటి ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు రావాలంటే 21 దేశాలు దాటి రావాలా? అన్న అనుమానం మీకు కలగొచ్చు. అయితే అతడు అందరిలా ఫ్లైట్‌లో రాలేదు. సుమారు 3 నెలలపాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి బ్రిస్బేన్‌కు చేరుకున్నాడు. అతడి పేరు ఎడ్‌ మిల్లర్‌. క్రికెట్ అంటే పిచ్చి. యాషెస్ టెస్టు సిరిస్ కోసమే అతడు ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చాడు. అతను ఇలా రోడ్డు ప్రయాణం ద్వారా ఆస్ట్రేలియా చేరుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ‘ద ఆడ్‌ బాల్స్‌ ఫౌండేషన్‌' అనే సంస్థ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది.

ఉద్యోగానికి విరామం ప్రకటించి, పక్కా ప్లాన్‌తోనే

ఉద్యోగానికి విరామం ప్రకటించి, పక్కా ప్లాన్‌తోనే

ఈ సంస్థకు విరాళాలు సేకరించి ఇవ్వాలనే ఉద్దేశంతో టీచర్‌ ఉద్యోగానికి జులై నుంచే విరామం ప్రకటించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. తన ప్రయాణంలో భాగంగా ఎక్కడి నుంచి బయల్దేరాలి, ఎక్కడ ఆగాలి, మళ్లీ ఎప్పుడు బయల్దేరాలి ఇలా పక్కాగా ప్లాన్‌ చేసుకున్న మిల్లర్‌ మూడు నెలల క్రితం బయల్దేరి గురువారానికి ఆస్ట్రేలియాలోని గబ్బా స్టేడియానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి బయల్దేరిన మిల్లర్ ముందుగా బెల్జియంకు చేరుకున్నాడు. ఆ తర్వాత లక్సంబర్గ్‌, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, స్లోవేనియా, హంగేరీ, చెక్‌ రిపబ్లిక్‌, పోలండ్‌, ఉక్రెయిన్‌, రష్యా, మంగోలియా, చైనా, హాంకాంగ్‌, వియత్నాం, లావోస్‌, కాంబోడియా, థాయ్‌లాండ్‌, మలేసియా, సింగపూర్‌, ఇండోనేషియా మీదుగా తొలి టెస్టు జరిగే బ్రిస్బేన్‌కు చేరుకున్నాడు.

మూడు నెలల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు

మూడు నెలల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు

తన మూడు నెలల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నట్లు మిల్లర్ ఈ సందర్భంగా తెలిపాడు. ‘ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులకు గురయ్యాను. డార్విన్‌ నుంచి బ్రిస్బేన్‌ రావడానికి నేను అనుకున్న బడ్జెట్‌లో కారు దొరకలేదు. ఆ తర్వాత ఓ అమ్మాయికి నేను చేపట్టిన పని గురించి చెప్పాను. దీంతో ఆమె రోజుకు 10డాలర్ల అద్దెతో ఓ కారు ఇచ్చింది' అని అన్నాడు.

ఎంతో మంది వ్యక్తులను కలిశాను

ఎంతో మంది వ్యక్తులను కలిశాను

'నా జీవితంలో ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ క్రమంలో ఎంతో మంది వ్యక్తులను కలిశాను. కొంత డబ్బు సంపాదించాను. దీన్ని త్వరలో ద ఆడ్‌బాల్స్‌ ఫౌండేషన్‌కు అందజేస్తాను' అని మిల్లర్ తెలిపాడు. కాగా, ఈ సిరీస్‌లో 3-2తో ఇంగ్లాండ్‌ జట్టు విజయం సాధిస్తుందని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డును జానీ బెయిర్‌ స్టో అందుకుంటాడని మిల్లర్ అన్నాడు.

గబ్బా టెస్టులో సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్

గబ్బా టెస్టులో సెంచరీతో చెలరేగిన స్టీవ్ స్మిత్

ఇదిలా ఉంటే గురువారం ప్రారంభమైన గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. ఓవర్ నైట్ స్కోరు 165/4తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 141 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై 26 పరుగుల ఆధిక్యం లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, November 25, 2017, 13:08 [IST]
Other articles published on Nov 25, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+