
ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కుప్పకూలిపోతుంటే ఆస్ట్రేలియా బౌలర్లలను డెవిడ్ మలన్ సునాయసంగా ఎదుర్కొన్నాడు. 49 బంతుల్లో 4 సిక్స్ లు, 7 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. అతనికి మొయిన్ అలీ 27 బంతుల్లో 44 పరుగులు చేసి సహకరించాడు. జోస్ బట్లర్ 17 పరుగులు చేయగా హెల్స్, స్టోక్స్, బ్రూక్స్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్ల పడగొట్టగా, జంపా 2, స్టార్క్, కమ్మిన్స్ తలో వికెట్ పడగొట్టారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లాడ్ పరుగులు తేడాతో విజయం సాధించింది. మిచెల్ మార్ష్ 29 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డెవిడ్ వేగంగా ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ అతను 23 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు.
చివర్లో ప్యాట్ కమ్మిన్స్
చివర్లో మాథ్య్ వెడ్, ప్యాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియాను గెలిపించేంత పని చేశారు. వెడ్ 10 బంతుల్లో 10 పరుగులు చేయగా కమ్మిన్స్ 11 బంతుల్లో 18 పరుగులు చేశారు. చివరి ఓవర్ లో ఆస్ట్రేలియాకు 22 పగులు చేయాల్సి వచ్చింది. సామ్ కరన్ వేసిన 20 వ ఓవర్ మొదటి బంతిని కమ్మిన్స్ సిక్సర్ గా మాలిచాడు. దీంతో 5 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు బౌండరి రాకపోవడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. సిరీస్ ను 2-0 తేడాతో గెలుపొందింది.