
మౌంట్ మౌంగానూయ్: ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ బౌలర్ అన్య ష్రూబ్సోల్ దెబ్బకొట్టడంతో 5.2 ఓవర్లలో టీమిండియా 25 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యాస్తిక భాటియా 8 పరుగులకే బౌల్డ్ అయింది. అలాకే కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం ఒకే పరుగు చేసి డంక్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. దీంతో టీమిండియా ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఆ కాసేపటికే దీప్తిశర్మ పరుగులేమి చేయకుండానే రనౌట్ అయింది. దీంతో టీమిండియా 8 ఓవర్లలో 28 పరుగులే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది.
వన్డే ఫార్మాట్లో ఇండియా ఉమెన్స్ టీం, ఇంగ్లండ్ ఉమెన్స్ టీం ఇప్పటివరకు 72 సార్లు తలపడ్డాయి. ఇందులో 39 సార్లు ఇంగ్లండ్ ఉమెన్స్ టీం గెలవగా.. ఇండియా ఉమెన్స్ టీం 32 సార్లు గెలిచింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్ విషయానికొస్తే ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు 11 సార్లు తలపడ్డాయి. ఇందులో 7 సార్లు ఇంగ్లండ్ ఉమెన్స్ టీం గెలవగా.. 4 సార్లు ఇండియా ఉమెన్స్ టీం గెలిచింది. కాగా గత వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా మహిళలు కప్ గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయారు.
ఇంగ్లండ్ ఉమెన్స్ టీం:
డేనియల్ వ్యాట్, టామీ బ్యూమాంట్, హీథర్ నైట్ (కెప్టెన్), నటాలీ స్కివర్, అమీ ఎలెన్ జోన్స్ (వికెట్ కీపర్), సోఫియా డంక్లీ, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, షార్లెట్ డీన్, అన్యా ష్రూబ్‌సోల్
ఇండియా ఉమెన్స్ టీం:
స్మృతి మంధాన, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.