Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: టీమిండియాదే బ్యాటింగ్.. చిచ్చరపిడుగు అరంగేట్రం!!

England Women have won the toss and opted to field, Shafali Verma makes her ODI debut for India

బ్రిస్టోల్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య మరికొద్దిసేపట్లో బ్రిస్టోల్‌లోని కౌంటీ మైదానంలో తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా కెప్టెన్ హీథర్‌ నైట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సోఫియా డంక్లే ఇంగ్లండ్ తరఫున ఆరంగేట్రం చేస్తోంది. మరోవైపు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించి.. ఇటీవల తన తొలి టెస్టులోనూ ఇంగ్లండ్‌పై గొప్పగా రాణించిన 17 ఏళ్ల ఓపెనర్‌ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ అరంగేట్రం చేయనుంది. స్మృతి మంధానతో కలిసి షెఫాలీ ఓపెనర్‌గా రానుంది.

జెమిమా రోడ్రిగ్స్ బదులుగా పూనమ్ రౌత్ వన్‌ డౌన్‌లో బరిలోకి దిగనుంది. వికెట్‌ కీపర్‌గా కొత్తమ్మాయి ఇంద్రాణీ రాయ్‌తో ప్రయోగం చేయకుండా.. టెస్టులో రాణించిన తానియా భాటియాకు అవకాశం ఇచ్చారు. ఇక పేసర్ల కోటాలో అరుంధతి రెడ్డికి నిరాశే ఎదురైంది. జులాన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రకర్ తుది జట్టులోకి వచ్చారు. మొదటి వన్డేలో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించడం మాత్రం అంత సులువుకాదు.

చివరగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ 1-4తో చిత్తయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్​పై మంచి ప్రదర్శనతో వచ్చే ఏడాది న్యూజిలాండ్లో జరిగే ప్రపంచకప్ దిశగా సన్నాహకాలను మెరుగ్గా ప్రారంభించాలని ఆశిస్తోంది. ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో తలపడిన భారత్‌ 30 మ్యాచ్‌ల్లో గెలిచింది. 37 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

తుది జట్లు:
భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధనా, పూనమ్ రౌత్, మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా, జులాన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రకర్, ఏక్తా బిస్త్.
ఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, లారెన్ విండ్‌ఫీల్డ్ హిల్, హీథర్ నైట్, నటాలీ స్కివర్, అమీ ఎల్లన్ జోన్స్, సోఫియా డంక్లే, కేథరీన్ బ్రంట్, సారా గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, అన్య ష్రబ్‌సోల్, కేట్ క్రాస్.

Story first published: Sunday, June 27, 2021, 15:47 [IST]
Other articles published on Jun 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+