Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ఇంగ్లండ్‌ మహిళ క్రికెటర్‌కు సీఎస్‌కే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌!!

England Woman Cricketer Kate Cross receives Jersey from CSK

లండన్: గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) 14వ సీజన్‌లో మాత్రం ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటానికి ముందు చెన్నై ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ధోనీసేన ప్రదర్శనపై ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు. గత సీజన్ మినహాయిస్తే.. చెన్నై ప్రతి ఏడాది అదరగొట్టింది. దీంతో చెన్నై టీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఈ జాబితాలో పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు.

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌ కేట్‌ క్రాస్‌ కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు పెద్ద అభిమాని. సీఎస్‌కే అంటే విపరీతమైన అభిమానం చూపించే కేట్‌కు సీఎస్‌కే ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. కేట్‌కు చెన్నై ఫ్రాంఛైజీ ప్రత్యేక జెర్సీని పంపింది. సీఎస్‌కే జెర్సీని అందుకున్న కేట్‌.. దానిని ధరించి తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. అంతేకాదు చెన్నైకి కృతజ్ఞతలు తెలిపింది. 29 ఏళ్ల కేట్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్టులు, 28 వన్డేలు, 13 టీ20లు ఆడింది.

'మీ అభిమానానికి థ్యాంక్స్‌ సీఎస్‌కే. మీరు పంపిన జెర్సీని ఇప్పుడే వేసుకున్నా. సీఎస్‌కే జెర్సీపై 16 నెంబర్‌ కేటాయించడం నాకు సంతోషంగా అనిపించింది. కానీ కరోనా పరిస్థితుల దృశ్యా ఐపీఎల్‌ 2021 రద్దు కావడం బాధ కలిగించింది. అయితే బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుంది. ఆట కంటే ముందు ప్రాణాలు ముఖ్యం. పరిస్థితులు చక్కబడి మళ్లీ లీగ్‌ ఆరంభిస్తే చూడాలని ఉంది' అంటూ ఇంగ్లీష్ బౌలర్ కేట్‌ క్రాస్‌ క్యాప్షన్‌ జత చేసింది. దేశంలో విలయం సృష్టిస్తున్న కరోనా.. ఐపీఎల్‌ను కూడా తాకడంతో అప్రమత్తమైన బీసీసీఐ టోర్నీని అర్ధంతరంగా నిలిపివేసింది. 14 ఏళ్ల లీగ్‌ చరిత్రలో ఇలా మధ్యంతరంగా ముగియడం ఇదే తొలిసారి.

సీఎస్‌కే జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ కూడా కరోనా బారీన పడినట్లు సీఎస్‌కే మంగళవారం రాత్రి ట్వీట్‌ చేసింది. మొదటగా బాలాజీకి వైరస్‌ సోకింది. దాంతో జట్టంతా వారం రోజుల కఠిన క్వారంటైన్‌కు వెళ్లింది. కానీ బాలాజీ వైరస్ సోకిన మరుసటి రోజే హస్సీకీ పాజిటివ్‌ రావడం కలకలం సృష్టించింది. ఈ ఫలితానికి రెండు రోజుల ముందు ఆయన సురేశ్‌ రైనా, ఫాఫ్ డుప్లెసిస్‌తో 15-20 నిమిషాలు మాట్లాడాడు. అంతేకాకుండా మరికొందరు ఆటగాళ్లతోనూ చర్చించాడని సమాచారం. దీంతో చెన్నై జట్టులో మరింత మందికి పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Wednesday, May 5, 2021, 19:49 [IST]
Other articles published on May 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+