Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్పిన్నర్ చాహల్‌ను ఆట పట్టించిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్

England Woman Cricketer Danielle Wyatt Teases Yuzvendra Chahal, Says Think Youre Smaller Than Me

హైదరాబాద్: టీమిండియా చైనామన్ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్-కుల్దీప్ యాదవ్‌లు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెస్టిండీస్‌తో చెన్నైలో జరిగిన తొలి వన్డే తర్వాత కుల్దీప్‌తో కలిసి దిగిన ఫోటోను చాహల్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "చెన్నైలో సరదాగా ఎత్తు చూసుకుంటూ" అనే కామెంట్ పెట్టాడు.

చాహల్ పోస్టుపై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి వాట్ ఆట పట్టించింది. చాహల్ పోస్టుకు "ఆలోచించు... నువ్వు నా కంటే ఎత్తు తక్కువ" అని కామెంట్ పెడుతూ నవ్వుతూ ఉన్న ఎమోజీని జత చేసింది. అయితే, భారత క్రికెటర్లు పోస్టులకు డానియెల్లి వాట్ కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ధోనీల పోస్ట్‌లపై కూడా డానియెల్లి ఆటపట్టిస్తూ కామెంట్లు పెట్టేది. ఇటీవల టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా జిమ్‌‌లో కసరత్తులు చేస్తోన్న ఫోటోకు డానియెల్లి చిన్న పిల్లల ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నావేంటి అంటూ సరదాగా కామెంట్ పెట్టిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో కుల్దీప్‌ యాదవ్‌కు చోటు దక్కగా, చాహల్‌కు ఆ అవకాశం లభించలేదు. తొలి వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 బుధవారం విశాఖ వేదికగా జరగనుంది.

Story first published: Tuesday, December 17, 2019, 15:21 [IST]
Other articles published on Dec 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+