For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరలో చతికిలపడ్డ కివీస్: ఫైనల్లోకి ఇంగ్లాండ్

By Pratap

న్యూఢిల్లీ: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. లీగ్ దశలో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన కివీస్ కీలకమైన సెమీస్ మ్యాచులో ఇంగ్లాండుపై ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండు ఫైనల్ కు చేరుకుంది. ట్వంటీ20 ప్రపంచకప్ పోటీల్లో ఇంగ్లాండు ఫైనల్ కు చేరుకోవడం ఇది రెండోసారి.

ఇంగ్లాండు 17.1 ఓవర్లలో 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 159 పరుగులు చేసింది. చివరలో బట్లర్ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో చెలరేగిపోయి విజయాన్ని అందించాడు. అతను 17 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. జ్యో రూట్ 22 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సంత్నర్ ఒక వికెట్ తీయగా, సోధీ రెండు వికెట్లు పడగొట్టాడు.

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ తమ ముందుంచిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ దంచికొట్టారు. ఐదు ఓవర్లలోనే 12 పరుగుల రన్ రేటుతో ఇంగ్లాండు వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది.

England win toss, bowl with dew in mind

ఇంగ్లాండు 12.1 ఓవర్ల వద్ద 110 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ వచ్చిన రాయ్ 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సోధీ బౌలింగులో అవుటయ్యాడు. రాయ్ 44 బంతుల్లో రెండు సిక్స్‌లు, 11 ఫోర్లతో 78 పరుగుల చేశాడు. సోధీ బౌలింగులోనే మోర్గాన్ డకౌటయ్యాడు. దీంతో 110 పరుగుల వద్దే ఇంగ్లాండు మూడో వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండు 8.2 ఓవర్ల వద్ద 82 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ఎలెక్స్ హేల్స్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సంత్నార్ బౌలింగులో అవుటయ్యాడు. అప్పటికి ఇంగ్లాండు రన్ రేట్ 9.92 ఉంది. సాధించాల్సిన రన్ రేట్ 6 పరుగలకు తగ్గిపోయింది. అంతకు ముందు జాసన్ రాయ్ 26 బంతుల్లో ఒక సిక్స్, 9 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండుపై జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచులో నాలుగో వికెట్ తర్వాత న్యూజిలాండ్ వికెట్లు క్రమం తప్పకుండా పడుతూ వచ్చాయి. నిర్ణీత 20 ఓవర్లలో ఓవర్ల వద్ద 153 పరుగులకే న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయింది. సాంత్నార్ 7 పరుగుల వ్యక్ితగత స్కోరు వద్ద స్టోక్ బౌలింగులో అవుటయ్యాడు.

అంతకు ముందు రోంచీ (3), అండర్సన్ (28) అవుటయ్యారు. ఇంగ్లాండు బౌలర్ స్టోక్స్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిలలాడింది. అతను మూడు వికెట్లు తీశాడు. విల్లె, జోర్డాన్, ప్లంకెట్, అలీ తలో వికెట్ తీశారు.

England win toss, bowl with dew in mind

ట్వంటీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండుపై జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మార్టిన్ గుప్తిల్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విల్లే బౌలింగులో అవుటయ్యాడు.

న్యూజిలాండ్ 16.3 ఓవర్ల వద్ద 134 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది. టైలర్ జోర్డాన్ బౌలింగులో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

న్యూజిలాండ్ 13.2 ఓవర్ల వద్ద 107 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ వచ్చిన మన్రో 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్లంకెట్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కానె విలియమ్సన్, కోలిన్ మన్రో ఇంగ్లాండు బౌలర్లను ఫోర్లతో ఉతికి ఆరేశారు. పది ఓవర్లలో కివీస్ 8.90 రన్ రేట్‌తో ఒక్క వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. విలియమ్సన్ 26 బంతుల్లో ఒక సిక్సర్, 3 పోర్లతో 31 పరుగులు, మన్రో ఒక్క సిక్సర్, ఆరు ఫోర్లతో 22 బంతుల్లో 36 పరుగులు చేశారు.

England win toss, bowl with dew in mind

ఈ క్రమంలో కివీస్ 91 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. విలియమ్సన్ 32 పరుగులు చేసి అలీ బౌలింగులో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచులో ఇంగ్లాండు, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

మంచు కారణంగా ఇంగ్లాండు ఫీల్గిండ్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. మార్టిన్ గుప్తిల్, కానె విలియమ్సన్ బ్యాటింగ్‌కు దిగారు. ఈ మ్యాచులో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు రేపటి సెమీ ఫైనల్‌లో గెలిచే జట్టుతో ఫైనల్‌లో తలపడుతుంది. రేపు (గురువారం) విండీస్, భారత్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచు జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+